Rupay Credit Card: రూపే కార్డుంటే 25శాతం క్యాష్‌ బ్యాక్‌.. విమాన ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌..

మీరు ఎక్కువగా విదేశాలకు వెళ్తుంటారా? అయితే మీకో గుడ్‌ న్యూస్‌. మీరు ఈ రూపే డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డులను వినియోగించి లావాదేవీలు జరిపితే మీకు 25శాతం ప్రత్యేక క్యాష్‌ బ్యాక్‌ ను అందిస్తున్నట్లు ఎన్‌పీసీఐ ఆధ్వర్యంలో పనిచేసే రూపే ప్రకటించింది. పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉండే ఈ ఆఫర్‌ ను రూపే కార్డు వినియోగదారులు వాడుకోవచ్చు.

Rupay Credit Card: రూపే కార్డుంటే 25శాతం క్యాష్‌ బ్యాక్‌.. విమాన ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌..
Rupay Credit Card

Updated on: May 20, 2024 | 7:57 AM

మీరు రూపే క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డు కలిగి ఉన్నారా? మీరు ఎక్కువగా విదేశాలకు వెళ్తుంటారా? అయితే మీకో గుడ్‌ న్యూస్‌. మీరు ఈ రూపే డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డులను వినియోగించి లావాదేవీలు జరిపితే మీకు 25శాతం ప్రత్యేక క్యాష్‌ బ్యాక్‌ ను అందిస్తున్నట్లు ఎన్‌పీసీఐ ఆధ్వర్యంలో పనిచేసే రూపే ప్రకటించింది. పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉండే ఈ ఆఫర్‌ ను రూపే కార్డు వినియోగదారులు వాడుకోవచ్చు. కెనడా, జపాన్, స్పెయిన్, స్విట్జర్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని డిస్కవర్ నెట్‌వర్క్ లేదా డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నెట్‌వర్క్‌లో కార్డ్‌లను అంగీకరించే వ్యాపారుల వద్ద పాయింట్-ఆఫ్-సేల్ కొనుగోళ్లపై 25% క్యాష్‌బ్యాక్ అందుకుంటారు. ఈ ఆఫర్ మే 15, 2024 నుంచి జూలై 31, 2024 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంటుంది. ఆఫర్ వ్యవధిలో కార్డ్‌కి ఒక్కో లావాదేవీకి గరిష్ట క్యాష్‌బ్యాక్ మొత్తం రూ. 2,500 వస్తుంది.

టూరిస్టులు పెరుగుతున్నారు..

ఈ వేసవిలో ప్రపంచవ్యాప్తంగా ఉత్తేజకరమైన గమ్యస్థానాలను అన్వేషించే భారతీయ ప్రయాణికుల పెరుగుదలను తాము చూస్తున్నామని ఎన్పీసీఐ ప్రొడక్ట్స్‌ చీఫ్‌ కునాల్‌ కళావతి అన్నారు. ఈ ట్రెండ్‌కు అనుగుణంగా, రూపే క్రెడిట్, డెబిట్ కార్డ్‌లకు పెరుగుతున్న జనాదరణకు తగి ఇవిధంగా, రూపే క్యాష్‌బ్యాక్ క్యాంపెయిన్ ను తీసుకొచ్చామన్నారు. అంతర్జాతీయ అంగీకార నెట్‌వర్క్‌తో, తమ కస్టమర్‌లకు సాటిలేని ప్రయోజనాలతో సురక్షితమైన లావాదేవీలను అందించాలని తాము లక్ష్యంగా ఆమె వివరించారు.

దీనిపై కూడా..

గత నెలలో, రూపే తన అంతర్జాతీయ రూపే జేసీబీ డెబిట్, క్రెడిట్ కార్డ్ హోల్డర్లందరికీ ప్రత్యేక క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. రూపే జేసీబీ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించే కస్టమర్‌లు ఇప్పుడు ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, శ్రీలంక, థాయ్‌లాండ్, వియత్నాం, స్పెయిన్ యూఎస్‌ఏలోని ఎనిమిది దేశాలలోని రిటైల్ స్టోర్‌లలో చేసిన కొనుగోళ్లపై 25% క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఈ ప్రత్యేక ఆఫర్ కోసం రూపే జేసీబీ ఇంటర్నేషనల్ కో. లిమిటెడ్‌తో చేతులు కలిపింది. ఈ ఆఫర్ మే 1, 2024 నుంచి జూలై 31, 2024 వరకు చెల్లుబాటులో ఉంటుంది. కార్డ్ హోల్డర్‌లు ఒక్కో లావాదేవీకి గరిష్టంగా రూ. 3,000 క్యాష్‌బ్యాక్ పొందవచ్చని ఎన్‌పీసీఐ తెలిపింది. ఆఫర్ వ్యవధిలో మొత్తం క్యాష్‌బ్యాక్ పరిమితి ఒక్కో కార్డ్‌కు రూ. 15,000గా ఉంటుంది.

ఇది చాలా అవసరం..

అంతర్జాతీయంగా ప్రయాణిస్తున్నప్పుడు, మీ డెబిట్, క్రెడిట్ కార్డ్ ఖర్చులపై ట్యాక్స్‌ కలెక్టర్‌ ఎట్‌ సోర్స్‌ (టీసీఎస్‌)చిక్కులను అర్థం చేసుకోవడం చాలా అవసరం అని గమనించాలి. అంతర్జాతీయ డెబిట్ కార్డుల ద్వారా ఏటా రూ. 7 లక్షలకు మించిన చెల్లింపులకు 20% టీసీఎస్‌ రేటు ఉంటుంది. దీనికి విరుద్ధంగా, క్రెడిట్ కార్డ్ లావాదేవీలు లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్‌) పరిధిలోకి వస్తాయి, వాటిని టీసీఎస్‌ బాధ్యతల నుంచి మినహాయింపు ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..