రాయల్ ఎన్‌ఫీల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలో భారత మార్కెట్‌లోకి 6 సరికొత్త మోడల్స్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

|

Apr 24, 2022 | 6:20 PM

Royal Enfield: బైకర్లలో బాగా ప్రాచుర్యం పొందిన రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 6 కొత్త మోటార్ సైకిళ్ళు అతి త్వరలో భారత మార్కెట్‌లోకి రానున్నాయి. ఇందులో 350సీసీ నుంచి 650సీసీ ఇంజన్‌లతో రానున్నాయి. ఇందులో మరో ప్రత్యేకత ఏంటంటే..

రాయల్ ఎన్‌ఫీల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలో భారత మార్కెట్‌లోకి 6 సరికొత్త మోడల్స్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Royal Enfield
Follow us on

‘బుల్లెట్’ వంటి ప్రముఖ బైక్‌ల తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్(Royal Enfield) త్వరలో 6 కొత్త మోటార్‌సైకిళ్లను మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ బైక్‌లన్నీ 350సీసీ నుంచి 650సీసీ పరిధిలో ఉండే అధిక కెపాసిటీ ఇంజన్‌లను కలిగి ఉంటాయి. ఇందులో RE Hunter 350, New RE Bullet 350, RE Super Meteor 650, RE Shotgun 650, RE Himalayan 450, RE Classic 650 మోడల్స్ ఉన్నాయి. ఎన్నో ప్రత్యేకతలతో రానున్న ఈ మోడల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

RE Hunter 350

నెట్టింట్లో వస్తున్న వార్తల ప్రకారం, రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ లెవల్‌లో కొత్త రోడ్‌స్టర్ బైక్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ వాహనం పేరు హంటర్ 350 కావచ్చని తెలుస్తోంది. రౌండ్ హెడ్‌లైట్, టెయిల్‌లైట్ కాకుండా డ్యూయల్ రియర్ షాకర్స్, సింగిల్ సీట్ వంటి ఫీచర్లు ఇందులో ఉంటాయని ఇప్పటివరకు లీక్ అయిన ఫొటోల ద్వారా తెలుస్తోంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేసిన 349cc ఎయిర్-లేదా ఆయిల్-కూల్డ్ ఇంజన్ ద్వారా శక్తిని పొందే అవకాశం ఉందని అంటున్నారు.

RE Super Meteor 650

రాయల్ ఎన్‌ఫీల్డ్ తన 650cc క్రూయిజర్ బైక్‌ను చాలా కాలంగా భారతీయ రహదారిపై పరీక్షిస్తోంది. ఇది దాదాపు 2020 నుంచి కొనసాగుతోంది. అతి త్వరలో ఈ మోటార్‌సైకిల్‌ను విడుదల చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది సెమీ-డిజిటల్ మీటర్, అల్లాయ్ వీల్స్, ట్రిప్పర్ నావిగేషన్‌తో కూడిన డ్యూయల్ ఛానల్ ABS వంటి డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇది ఇప్పటికే ఉన్న ఇంటర్‌సెప్టర్ 650 ట్విన్ సిలిండర్ ఇంజన్‌ని పోలి ఉండే 648cc ఇంజన్‌తో మార్కెట్‌లోకి రానున్నట్లు తెలుస్తోంది.

RE Shotgun 650

రాయల్ ఎన్‌ఫీల్డ్ SG650 అనే కాన్సెప్ట్ మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించింది. ఇది మస్క్యులర్, అగ్రెసివ్ డిజైన్‌తో కూడిన బాబర్ మోటార్‌సైకిల్‌గా రానుంది. ఈ సంవత్సరం చివరి నాటికి, ఈ బాబర్ బైక్‌ను షాట్‌గన్ 650 పేరుతో విడుదల చేయవచ్చని తెలుస్తోంది. ఇది RE సూపర్ మెటోర్ 650 ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో రావచ్చని భావిస్తున్నారు.

New RE Bullet 350

రాయల్ ఎన్‌ఫీల్డ్ తదుపరి తరం బుల్లెట్ స్టాండర్డ్ 350ని కూడా త్వరలో భారత మార్కెట్లో విడుదల చేయవచ్చని అంటున్నారు. ఇటీవల దాని రోడ్ టెస్టింగ్ సమయంలో తీసిన కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. దీని డిజైన్ ప్రస్తుత క్లాసిక్ 350 మాదిరిగానే ఉంటుందని భావిస్తున్నారు. వార్తల ప్రకారం, కొత్త బుల్లెట్ 350లో కొంచెం తక్కువ ఫీచర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బైక్‌ను కొంచెం చౌకగా తీసుకరానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి J-సిరీస్ 349cc ఇంజన్ ద్వారా శక్తిని పొందుతుంది.

RE Himalayan 450

భారతీయ మోటార్‌సైకిల్ మార్కెట్లో హిమాలయన్ తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకుంది. ప్రస్తుతం కంపెనీ తన కొత్త అధునాతన వెర్షన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ మోటార్‌సైకిల్ 450సీసీ ఇంజన్‌తో ఉండనుంది. వచ్చే ఏడాది నాటికి ఇది భారత మార్కెట్‌లోకి రానుంది. ఇది లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉండవచ్చని తెలుస్తోంది. ఇది గరిష్టంగా 40 PS పవర్, 40 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

RE Classic 650

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 500 విక్రయాలను మార్కెట్‌లో నిలిపివేసినప్పటి నుంచి, ఈ వర్గంలోని మోటార్‌సైకిల్‌కు డిమాండ్ కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ 650సీసీ ఇంజన్‌తో క్లాసిక్ మోడల్‌ను విడుదల చేయవచ్చని సమాచారం. టెస్టింగ్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇంతకు ముందు కూడా నెట్టింట్లో సందడి చేశాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Watch Video: చేపల కోసం వెళ్తే.. వలలో చిక్కిన 22 ఏళ్ల నాటి బాక్స్.. ఓపెన్ చేసి చూస్తే ఫ్యూజులు ఔట్..

May 2022 Bank Holidays: మే నెలలో 13 రోజులు బ్యాంకులకు సెలవులు.. ఏయే రోజు అంటే..

Credit Card: మీరు క్రెడిట్‌ కార్డులను వాడుతున్నారా..? కార్డును తెలివిగా ఉపయోగించడానికి చిట్కాలు..!