Rivot NX100: ఓలా, ఏథర్‌ కంపెనీలకు పోటీగా కొత్త స్కూటర్‌ రిలీజ్‌ చేసిన రివోట్‌.. తక్కువ ధరకే స్టన్నింగ్‌ ఫీచర్స్‌

| Edited By: Ravi Kiran

Oct 27, 2023 | 9:15 PM

ఈవీ వాహనాలపై పెరిగిన డిమాండ్‌ నేపథ్యంలో కొత్త కొత్త స్టార్టప్‌ కంపెనీలు కూడా ఈవీ వాహనాలు లాంచ్‌ చేస్తున్నాయి. కర్ణాటకలోని బెలగావి కేంద్రంగా ఉన్న స్టార్ట్‌ కంపెనీ రివో తాజాగా ఈవీ మార్కెట్‌లోకి ప్రవేశించాలని యోచిస్తుంది. 280 కిలోమీటర్ల పరిధితో వచ్చే రివోట్‌ ఎన్‌ఎక్స్‌ 100 పేరతో కొత్త ఈవీ స్కూటర్‌ను లాంచ్‌ చేసింది. ఈ స్కూటర్‌ గురించి మరిన్ని వివరాలను ఓ సారి తెలుసుకుందాం. 

Rivot NX100: ఓలా, ఏథర్‌ కంపెనీలకు పోటీగా కొత్త స్కూటర్‌ రిలీజ్‌ చేసిన రివోట్‌.. తక్కువ ధరకే స్టన్నింగ్‌ ఫీచర్స్‌
Rivot Nx100
Follow us on

భారతదేశంలో ఈవీ వాహనాల హవా నానాటికి పెరుగుతూ పోతుంది. ఓలా, టీవీఎస్ మోటార్, ఏథర్ ఎనర్జీ వంటి సంస్థలు ఈవీ వాహనాల అమ్మకాల్లో వృద్ధిని కనబరుస్తున్నాయి. ఓ నివేదిక ప్రకారం 2023లో ఇప్పటివరకు 6.6 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు విక్రయించారనే ప్రజలు వీటిని ఎంతగా ఆదరిస్తున్నారో? అర్థం చేసుకోవచ్చు. అయితే ఈవీ వాహనాలపై పెరిగిన డిమాండ్‌ నేపథ్యంలో కొత్త కొత్త స్టార్టప్‌ కంపెనీలు కూడా ఈవీ వాహనాలు లాంచ్‌ చేస్తున్నాయి. కర్ణాటకలోని బెలగావి కేంద్రంగా ఉన్న స్టార్ట్‌ కంపెనీ రివో తాజాగా ఈవీ మార్కెట్‌లోకి ప్రవేశించాలని యోచిస్తుంది. 280 కిలోమీటర్ల పరిధితో వచ్చే రివోట్‌ ఎన్‌ఎక్స్‌ 100 పేరతో కొత్త ఈవీ స్కూటర్‌ను లాంచ్‌ చేసింది. ఈ స్కూటర్‌ గురించి మరిన్ని వివరాలను ఓ సారి తెలుసుకుందాం. 

రివోట్ మోటార్స్‌ను గతంలో సాఫ్ట్‌వేర్ పరిశ్రమలో పనిచేస్తున్న అజిత్ పాటిల్ స్థాపించారు. అతను 2009లో తిరిగి ఎలక్ట్రిక్ స్కూటర్‌ని కొనుగోలు చేశాడు. కానీ దానిని క్రమం తప్పకుండా రిపేర్ చేయాల్సి వచ్చింది. దీంతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని స్వయంగా రూపొందించాలని అనుకున్నాడు. 2018లో కంపెనీని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. రివోట్‌ ఎన్‌ఎక్స్‌ 100లో ఇంతకు ముందు తాను ఎదుర్కొన్న సమస్యలే ఈ స్కూటర్‌ను అభివృద్ధి చేయడంలో తనకు సహాయపడ్డాయని పేర్కొన్నారు. 

రివోట్‌ ఎన్‌ఎక్స్‌ 100 ఫీచర్లు ఇలా

రివోట్‌ ఎన్‌ఎక్స్‌ 100 స్కూటర్ ఐదు వేరియంట్లలో లభ్యం అవుతుంది. బేస్ వేరియంట్ 1,920 డబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. బేస్‌ మోడల్‌ 100 కిలోమీటర్ల మైలేజ్‌ వచ్చేలా రూపొందించారు. ఇతర వేరియంట్‌లు 3,840డబ్ల్యూహెచ్‌, 5,760 డబ్ల్యూహెచ్‌ అనే వెర్షన్స్‌లో పెద్ద బ్యాటరీ ప్యాక్‌లతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ స్కూట 200 కిలో మీటర్లు, 280 కిలోమీటర్ల పరిధితో వస్తాయి. అయితే ఈ శ్రేణి ఇంకా పరీక్షించలేదని మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. 

ఇవి కూడా చదవండి

ఎన్‌ఎక్స్‌ 100 ఈవీ మార్కెట్లో అందుబాటులో ఉన్న అన్ని స్కూటర్ల కంటే అప్‌గ్రేడబుల్ శ్రేణితో ఉంటుంది. ఇందులో ఎవరైనా తక్కువ వేరియంట్‌ని ఉపయోగించే వారు అధిక వేరియంట్ స్కూటర్‌ను ఎంచుకోకుండా బ్యాటరీ ప్యాక్‌ను అప్‌గ్రేడ్ చేయవచ్చు. ఈ స్కూటర్‌లు స్కూటర్‌లోనే నిక్షిప్తమయ్యే ఛార్జింగ్ కేబుల్స్‌తో  వస్తాయి. అలాగే ఈ స్కూటర్‌లు సహాయక పవర్ యూనిట్‌ను పొందుతాయి, ఇది ఆన్‌బోర్డ్‌లోని బ్యాటరీలలో చార్జింగ్‌ అయిపోతే, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది.

రూ.499కే బుకింగ్‌

రివోట్‌ ఎన్‌ఎక్స్‌ 100ను రూ. 499 టోకెన్ మొత్తానికి స్కూటర్‌ను ప్రీ-బుక్ చేసుకోవచ్చు. స్కూటర్ డెలివరీలు 2024 మధ్య నాటికి ప్రారంభమవుతాయని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. బేస్ వేరియంట్ ధర రూ. 89,000 మధ్య ఉండవచ్చని అంచనా. టాప్ స్పెక్ వేరియంట్ కోసం రూ. 1.59 లక్షల ఉండవచ్చని మార్కెట్‌ వర్గాలు వివరిస్తున్నాయి. అలాగే ఈ కంపెనీ భారతదేశంలోని 30 నగరాల్లో డీలర్‌షిప్‌లను ప్రారంభించనుంది.  ముఖ్యంగా ఈ స్కూటర్‌ ప్రారంభ సంవత్సరంలో 10,000 స్కూటర్లను ఉత్పత్తి చేయాలని కంపెనీ భావిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..