Edible Oils: కేంద్రం గుడ్‎న్యూస్.. వంట నూనె నిల్వలపై పరిమితులు విధింపు.. తగ్గనున్న నూనె ధరలు..!

మార్కెట్‎లో వంట నూనెల ధరలు మండిపోతున్నాయి. ఏ బ్రాండ్ వంట నూనె అయినా లీటర్ రూ.150కు తక్కువగా లేదు. దీంతో వినియోదారులపై భారాన్ని తగ్గించాలని భావించిన కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది...

Edible Oils: కేంద్రం గుడ్‎న్యూస్.. వంట నూనె నిల్వలపై పరిమితులు విధింపు.. తగ్గనున్న నూనె ధరలు..!
Oil
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 10, 2021 | 5:43 PM

మార్కెట్‎లో వంట నూనెల ధరలు మండిపోతున్నాయి. ఏ బ్రాండ్ వంట నూనె అయినా లీటర్ రూ.150కు తక్కువగా లేదు. దీంతో వినియోదారులపై భారాన్ని తగ్గించాలని భావించిన కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. నూనె ధరలు తగ్గించేందుకు వ్యాపారుల వద్ద నూనెలు, నూనె గింజల నిల్వలపై పరిమితులు విధించాలని నిర్ణయించింది. పరిమితులు మార్చి 2022 వరకు అమలులో ఉంటాయని తెలిపింది. ఆహార, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్‌మెంట్ ఈ వస్తువులపై స్టాక్ పరిమితులను తక్షణమే అమల్లోకి తీసుకురావాలని ఆదేశించింది. ఇప్పటికే ఎన్​సీడీఈఎక్స్​ ప్లాట్​ఫామ్​పై..మస్టర్డ్​ ఆయిల్ ట్రేడింగ్‎ను అక్టోబర్​ 8 నుంచి నిలిపివేశారు. కేంద్రం నిర్ణయంతో దేశీయ మార్కెట్లలో నూనెల ధరలు తగ్గే అవకాశం ఉంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో వంట నూనెకు అధిక ధరలు ఉండడంతో దేశీయంగా నూనె ధరలపై ప్రభావాన్ని చూపుతున్నాయని ఆహార, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. నూనెల వంటి నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించేలా చూడడానికి ప్రభుత్వం బహుముఖ వ్యూహాన్ని కలిగి ఉందని చెప్పింది. దిగుమతి సుంకం హేతుబద్ధీకరణతోపాటు వ్యాపారుల వద్ద ఉన్న స్టాక్‌ స్వీయ-బహిర్గతం కోసం వెబ్-పోర్టల్‌ను ఇప్పటికే ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. నూనె ధరల తగ్గిపునకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను వివరిస్తూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఉత్తర్వుల ప్రకారం సంబంధిత రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల నిల్వలపై పరిమితిని విధించాలని ఆదేశించింది. చట్టపరమైన సంస్థలు ఏవైనా పరిమితికి మించి నిల్వలను కలిగి ఉంటే.. ఆ వివరాలను ప్రజా పంపిణీ వ్యవస్థ పోర్టల్‎​లో పొందుపరచాలని కేంద్రం సూచించింది. రాష్ట్రాలు ఎప్పటికప్పుడు నూనెలు, నూనె గింజల పరిమిమతుల వివరాలను కేంద్రప్రభుత్వం వెబ్​సైట్‎​లో అప్​డేట్​ చేయాలని కోరింది.

అయితే కొంతమంది ఎగుమతి, దిగుమతిదారులకు మినహాయింపు ఇచ్చింది కేంద్రం. డైరెక్టర్​ జనరల్​ ఆఫ్​ ఫారిన్ ట్రేడ్​.. ఎక్స్​పోర్టర్​- ఇంపోర్టర్​ కోడ్​ ఇచ్చిన వారికి మాత్రమే ఈ మినహాయింపులు వర్తిస్తాయని పేర్కొంది. దేశీయంగా నూనె గింజల ఉత్పత్తిని పెంచడానికి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ప్రస్తుతం నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్-ఆయిల్ ఫామ్ అనే కేంద్ర ప్రాయోజిత పథకాన్ని నిర్వహిస్తోంది. మలేషియా, ఇండోనేషియా భారతదేశానికి ప్రధాన నూనె దిగుమతిదారుగా ఉంది.

Read Also..  Mutual Funds SIP: మ్యూచువల్ ఫండ్స్ సిప్‌లలో 10 వేల కోట్లకు పైగా రికార్డు పెట్టుబడి..కారణాలు ఏమిటంటే..