UPI Payments: త్వరలో యూపీఐలో ఆ ఫీచర్ కనుమరుగు.. అదే అసలు కారణం

|

Mar 20, 2025 | 3:15 PM

భారతదేశంలో 2016లో నోట్ల రద్దు తర్వాత నగదు లావాదేవీలను పరిమితం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్‌పీసీఐ సాయంతో తీసుకొచ్చిన యూపీఐ సేవలు చాలా ప్రజాదరణ పొందాయి. ముఖ్యంగా చిన్న మొత్తాల లావాదేవీలకు యూపీఐ సేవలు బాగా ఉపయోగపడుతున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే చిల్లర సమస్యకు యూపీఐ లావాదేవీలు చెక్ పెట్టాయి. అయితే యూపీఐ లావాదేవీల్లో కీలకంగా ఉండే కలెక్ట్ పేమెంట్ ఫీచర్‌ త్వరలో కనుమరుగు కానుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

UPI Payments: త్వరలో యూపీఐలో ఆ ఫీచర్ కనుమరుగు.. అదే అసలు కారణం
Upi
Follow us on

నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) యూపీఐలోభారీ మార్పులను చేయడానికి సిద్ధం అవుతుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఎన్‌పీసీఐ త్వరలో పర్సన్-టు- పర్సన్ లావాదేవీల కోసం యూపీఐ నుంచి “కలెక్ట్ పేమెంట్” అనే ఫీచర్‌ను తీసివేయవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే కలెక్ట్ పేమెంట్ ఫీచర్ పెద్ద వ్యాపార లావాదేవీలకు అందుబాటులో ఉంటుందని, సాధారణ ప్రజలకు ఇది అందుబాటులో ఉండదని పేర్కొంటున్నారు. ముఖ్యంగా యూపీఐ పేరుతో జరుగుతున్న మోసాల్లో ఎక్కువ శాతం కలెక్ట్ పేమెంట్ ఫీచర్ ద్వారానే జరుగుతుందని గుర్తించిన ఎన్‌పీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని త్వరలోనే ఈ ఫీచర్‌ను డిజేబుల్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. 

కలెక్ట్ పేమెంట్ ఫీచర్ అంటే 

యూపీఐ యాప్స్‌లో “ఫూల్ ఆధారిత” ఫీచర్‌గా ఉండే దీని ద్వారా వ్యాపారి కస్టమర్ నుంచి చెల్లింపును రిక్వెస్ట్ చేస్తాడు.  మీరు ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నప్పుడు చెల్లింపు కోసం మీకు నచ్చిన యూపీఐ యాప్‌ను ఎంచుకున్నప్పుడు మీరు ఆటోమెటిక్‌గా యూపీఐ యాప్‌కు చేరుకుంటారు, అక్కడ మీరు చెల్లింపు మొత్తాన్ని చూస్తారు. దానిని ఆమోదించడానికి పిన్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. యూపీఐకు సంబంధించిన ఈ సౌకర్యాన్ని ఫూల్ పేమెంట్ ఫీచర్ అని పిలుస్తారు. దీని ద్వారా వ్యాపారులు కస్టమర్ల నుంచి చెల్లింపులను స్వీకరించడం సులభం అవుతుంది. అయితే సామాన్యులు ఈ ఫీచర్‌ను పెద్దగా ఉపయోగించరు కానీ వ్యాపారంలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

పెరుగుతున్న ఆందోళనలు 

ప్రస్తుతం అనేక రకాల ఆన్‌లైన్ మోసాలు జరుగుతున్నాయి. ఈ తరహా మోసాల్లో యూపీఐ ఫూల్ పేమెంట్ ఫీచర్ విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. మోసం చేసే వారికి ముందుగా వారి ఫోన్‌లో పాప్-అప్ సందేశం వస్తుంది. వారు పిన్ ఎంటర్ చేసిన వెంటనే వారి ఖాతా నుండి డబ్బు కట్ అవుతుంది. ఎన్‌పీసీఐ దీన్ని మూసివేసి క్యూఆర్ కోడ్, పుష్ పేమెంట్స్‌ను ప్రోత్సహించాలనుకుంటోంది. క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు సురక్షితమైన సాంకేతికతగా పరిగణఇస్తారు. ఇప్పటికీ అనేక యాప్‌లు, వెబ్‌సైట్‌లలో ఈ పద్ధతి ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి. ఉదాహరణకు ఐఆర్‌సీటీసీలో చెల్లింపు చేస్తున్నప్పుడు యూపీఐ ఐడీను నమోదు చేయడానికి బదులుగా ఆ చెల్లింపు కోసం క్యూఆర్ కోడ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దీంతో పాటు పుష్ వ్యవస్థను కూడా ప్రోత్సహించవచ్చు. అంటే మీరు సాధారణంగా మీ ఫోన్‌లో యూపీఐ యాప్‌ను తెరిచి మీ మొబైల్ లేదా యూపీఐ ఐడీను నమోదు చేసి చెల్లింపు చేసినట్లే ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి