
ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) కెమెరాల ద్వారా గుర్తించి అన్ని వాహనాల లైఫ్ టైమ్ అయిపోయిన (End-of-Life) వాహనాలను జూలై 1 నుండి ఢిల్లీలోని పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపడానికి అనుమతించబోమని కమిషన్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) ప్రకటించింది. 10 సంవత్సరాల కంటే పాత డీజిల్ వాహనాలు, 15 సంవత్సరాల కంటే పాత పెట్రోల్ వాహనాల జీవిత కాలం అయిపోయిన (EOL) వాహనంగా పరిగణిస్తారు. CAQM ప్రకారం, ఈ నిషేధం నవంబర్ 1 నుండి గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్, సోనిపట్‌లకు విస్తరించనున్నారు. అలాగే ఏప్రిల్ 1, 2026 నుండి మిగిలిన NCR ప్రాంతాలను కవర్ చేస్తుంది.
3.63 కోట్లకు పైగా వాహనాలను తనిఖీ:
ఢిల్లీలోని 500 ఇంధన కేంద్రాలలో ANPR కెమెరాలను ఏర్పాటు చేశామని, దీనివల్ల వాహన డేటా రియల్ టైమ్ ట్రాకింగ్ సాధ్యమవుతుందని CAQM సభ్యుడు డాక్టర్ వీరేంద్ర శర్మ అన్నారు. ఇప్పటివరకు ఈ వ్యవస్థ 3.63 కోట్లకు పైగా వాహనాలను తనిఖీ చేసిందని, వాటిలో 4.90 లక్షల వాహనాలను లైఫ్ టైమ్ నిలిచిపోయినట్లు గుర్తించామని చెప్పారు. 29.52 లక్షల వాహనాలు తమ కాలుష్య నియంత్రణ ధృవీకరణ పత్రాన్ని (PUCC) పునరుద్ధరించాయని, ఫలితంగా రూ.168 కోట్ల విలువైన చలాన్లు జారీ చేసినట్లు శర్మ చెప్పారు.
100 ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు:
డేటాను పర్యవేక్షించడానికి ఎక్కువగా ఫ్లాగ్ చేయబడిన వాహనాలతో ఇంధన స్టేషన్లను గుర్తించడానికి కఠినమైన నిర్ణయాల అమలుకు ఢిల్లీ రవాణా శాఖ 100 ప్రత్యేక బృందాలను నియమించింది. ఢిల్లీ, NCR పోల్యూషన్‌ను శుభ్రం చేయడానికి పాత బీఎస్ ప్రమాణాల వాహనాలను తొలగించడం చాలా ముఖ్యం అని శర్మ అన్నారు. వాయు కాలుష్యంలో ఈ వాహనాలు పెద్ద పాత్ర పోషిస్తాయి. ఇప్పుడు పారదర్శకమైన, డిజిటల్, జవాబుదారీ వ్యవస్థ అమలు చేసినందున ఈ వ్యవస్థను మరింత ప్రభావవంతంగా చేయడానికి టోల్ కేంద్రాలలో కూడా దీనిని ఉపయోగిస్తారు. దీని కోసం సుమారు 100 అమలు బృందాలు పని చేస్తాయి.
ఇది కూడా చదవండి: Google, Apple: ప్రమాదంలో 16 బిలియన్ల మంది గూగుల్, ఆపిల్ వినియోగదారులు.. ప్రపంచ వ్యాప్తంగా టెన్షన్!
ANPR వ్యవస్థ ఎలా పని చేస్తుంది?
వాహనాలు ఇంధన స్టేషన్ల వద్దకు చేరుకున్నప్పుడు ANPR వ్యవస్థ స్వయంచాలకంగా లైసెన్స్ ప్లేట్ నంబర్‌లను స్కాన్ చేస్తాయి. ఇది వాహన డేటాబేస్‌తో డేటాను క్రాస్-రిఫరెన్స్ చేస్తుంది. ఇది రిజిస్ట్రేషన్ వివరాలు, ఇంధన రకం, వాహనం వయస్సు వంటి సమాచారాన్ని సేకరిస్తుంది. ఒక వాహనం చట్టపరమైన కాలపరిమితికంటే ఎక్కువగా ఉన్నట్లు తేలితే, దానిని ఎండ్ ఆఫ్ లైఫ్‌గా గుర్తిస్తారు. ఫ్లాగ్ చేసిన తర్వాత పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ వేయొద్దని హెచ్చరిక ద్వారా అలర్ట్ చేస్తుంది. దీంతో అలాంటి వాహనాలకు పెట్రోల్ గానీ,డీజిల్ గానీ వేయరు. ఉల్లంఘనను రికార్డ్ చేసి అమలు సంస్థలకు పంపుతుంది. వారు వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం లేదా స్క్రాప్ చేయడం వంటి తదుపరి చర్యలు తీసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: Luxurious Prisons: ప్రపంచంలోని ఈ 7 జైళ్లలో ఖైదీలకు లగ్జరీ హోటల్ సదుపాయాలు
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి