రూ.5కే వాటర్ బాటిల్.. రిలయన్స్ సంచలనం.. ప్రత్యర్థులకు షాక్..

గతంలో జియోతో టెలికాం రంగంలో రిలయన్స్ ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. జియో దెబ్బకు ఇతర కంపెనీలు భారీగా ధరలను తగ్గించాయి. ఈ క్రమంలోనే డ్రింకింగ్ వాటర్ రంగంలో సంచలనాలు సృష్టించేందుకు రిలయన్స్ సిద్ధమైంది. అతి తక్కువ ధరకే వాటర్ బాటిల్‌ను తీసుకరానుంది.

రూ.5కే వాటర్ బాటిల్.. రిలయన్స్ సంచలనం.. ప్రత్యర్థులకు షాక్..
Reliance Launches Campa Sure Water

Updated on: Sep 30, 2025 | 8:18 AM

దేశంలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ మార్కెట్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ పూర్తిగా మార్చేయనుంది. ఇప్పటికే జియో, కాంపా కోలాతో మార్కెట్‌లో సంచలనం సృష్టించిన రిలయన్స్ ఇప్పుడు వాటర్ రంగంలో అడుగుపెట్టి.. ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. సుమారు రూ. 20వేల కోట్ల విలువైన ఈ మార్కెట్‌లో.. రిలయన్స్ తన కొత్త బ్రాండ్‌లైన కాంపా ష్యూర్.. అతి తక్కువ ధరకే వాటర్ బాటిల్ తీసుకరానుంది. కాంపా ష్యూర్, ఇండిపెండెన్స్ వాటర్ బ్రాండ్లు మార్కెట్‌లో ఉన్న వాటి కంటే 20-43 శాతం తక్కువ ధరలకు విక్రయించేందుకు రిలయన్స్ సిద్ధమైంది. ఈ వ్యూహం డ్రింకింగ్ వాటర్ రంగంలో రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఉపయోగపడుతుంది.

ధరల పోలిక: 20-43% తక్కువ..!

రిలయన్స్ తీసుకొచ్చిన ధరలు, ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న బిస్లెరి, ఆక్వాఫినా, కిన్లీ వంటి కంపెనీల కంటే 20శాతం నుండి 43శాతం వరకు తక్కువగా ఉన్నాయి.

ధరల ఇలా ఉండే అవకాశం :

250ml వాటర్ బాటిల్ – 5 ( బిస్లెరి – రూ.7)

500ml వాటర్ బాటిల్ – 10 ( కిన్లీ – రూ.13)

1 లీటర్ కాంపా ష్యూర్ బాటిల్: రూ. 15 (బిస్లెరి, ఆక్వాఫినా, కిన్లీలకు రూ. 20)

2 లీటర్ కాంపా ష్యూర్ ప్యాక్: రూ. 25 (ప్రత్యర్థులకు రూ. 30–35)

1.5 లీటర్ ఇండిపెండెన్స్ బాటిల్: రూ. 20 (ప్రత్యర్థులకు రూ. 30–35)

సెప్టెంబర్‌లో మొదలైన కాంపా ష్యూర్ బ్రాండ్‌.. అక్టోబర్ నాటికి దేశమంతటా అందుబాటులోకి రానుంది. ఈ ధరల తగ్గింపు వలన ప్రజలకు తక్కువ ధరకే మంచి నీరు లభిస్తుంది. జియో, కాంపా కోలా ఫార్ములా: రిలయన్స్ గతంలో టెలికాంలో జియోతో కూల్ డ్రింక్ రంగంలో తక్కువ ధరలకే కాంపా కోలాను తీసుకొచ్చింది. అదే వ్యూహాన్ని ఇప్పుడు వాటర్ వ్యాపారంలో అమలు చేస్తోంది.

ఇతర కంపెనీలపై ప్రభావం

నీటి సరఫరా సరిగా లేకపోవడం, జనాభా పెరగడం వంటి కారణాల వలన బాటిల్ వాటర్ అమ్మకాలు బాగా పెరుగుతున్నాయి. గత 5 ఏళ్లలో ఈ మార్కెట్ 40-45శాతం పెరిగింది. ప్రస్తుతానికి బిస్లెరి 36శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉంది. రిలయన్స్ ధరల యుద్ధం కారణంగా మార్కెట్‌లో పెద్ద మార్పులు వస్తాయి.

బిస్లెరి, కోకా-కోలా, పెప్సికో వంటి కంపెనీలు తమ మార్కెట్ వాటాను కాపాడుకోవడానికి తమ ధరలను తగ్గించవలసి లేదా కొత్త ఆఫర్‌లను ప్రకటించవలసి వస్తుంది. అయితే పెద్ద పంపిణీ నెట్‌వర్క్, తయారీ సౌకర్యాలు రిలయన్స్‌కు సవాలుగా ఉండవచ్చు. మొత్తంగా రిలయన్స్ ప్రవేశం వలన దేశంలో బాటిల్ వాటర్ ధరలు తగ్గే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..