Jio Offers: రిలయన్స్ జియో అదిరిపోయే ప్లాన్స్.. 30 రోజులు 100 జీబీ డేటా.. యాడ్ ఆన్ సర్వీస్ కూడా.. వివరాలివే..

30 రోజుల ట్రయల్‌ని అందిస్తోంది. ఈ రెండు ప్లాన్స్ రూ. 399, రూ. 699. ఈ ప్లాన్స్ ఫ్యామిలీ ప్యాక్ కోసం తీసుకొచ్చారు. అంటే, మీరు రెండు ప్లాన్‌లలో దేనినైనా ఉపయోగిస్తే.. మీ కుటుంబంలోని ఇతర సభ్యుల కోసం యాడ్-ఆన్ కనెక్షన్‌ ఆప్షన్ పొందుతారు. జియో మొబైల్ పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌ని ఉపయోగించాలనుకునే వారికి ఈ రెండు ప్లాన్‌లు సూపర్ బెనిఫిట్ అని చెప్పొచ్చు. అయితే, 30 రోజుల ట్రయల్ వ్యవధి తర్వాత.. కస్టమర్‌లు ఈ రెండు పోస్ట్‌పెయిడ్ సర్వీస్ ప్లాన్‌లను ఉపయోగించాలా వద్దా..

Jio Offers: రిలయన్స్ జియో అదిరిపోయే ప్లాన్స్.. 30 రోజులు 100 జీబీ డేటా.. యాడ్ ఆన్ సర్వీస్ కూడా.. వివరాలివే..
Jio Recharge Plan

Updated on: Aug 04, 2023 | 1:53 PM

రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం రెండు పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను తీసుకువచ్చింది. 30 రోజుల ట్రయల్‌ని అందిస్తోంది. ఈ రెండు ప్లాన్స్ రూ. 399, రూ. 699. ఈ ప్లాన్స్ ఫ్యామిలీ ప్యాక్ కోసం తీసుకొచ్చారు. అంటే, మీరు రెండు ప్లాన్‌లలో దేనినైనా ఉపయోగిస్తే.. మీ కుటుంబంలోని ఇతర సభ్యుల కోసం యాడ్-ఆన్ కనెక్షన్‌ ఆప్షన్ పొందుతారు. జియో మొబైల్ పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌ని ఉపయోగించాలనుకునే వారికి ఈ రెండు ప్లాన్‌లు సూపర్ బెనిఫిట్ అని చెప్పొచ్చు. అయితే, 30 రోజుల ట్రయల్ వ్యవధి తర్వాత.. కస్టమర్‌లు ఈ రెండు పోస్ట్‌పెయిడ్ సర్వీస్ ప్లాన్‌లను ఉపయోగించాలా వద్దా అనేది కూడా డిసైడ్ చేసుకోవచ్చు.

రిలయన్స్ జియో రూ. 399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్..

జియో రూ. 399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ వినియోగదారులకు 75GB డేటాను అందిస్తుంది. ఈ మొత్తం డేటా అయిపోయిన తర్వాత 1GBకి రూ.10 వెచ్చించాల్సి ఉంటుంది. ఒక్కో ప్లాన్‌కు గరిష్టంగా మూడు యాడ్-ఆన్ కనెక్షన్‌లను పొందే అవకాశం ఉంది. ఆ సిమ్‌లలో ప్రతి నెలా 5GB డేటా వస్తుంది. అంతేకాకుండా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు కూడా వినియోగదారులు పొందుతారు. అయితే, ప్రతి అదనపు సిమ్ కోసం నెలకు రూ. 99 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ యూజర్లకు 5జీ అపరిమిత డేటా లభిస్తుంది. జియో సినిమా, జియో క్లౌడ్, జియో టీవీ సబ్‌స్క్రిప్షన్స్ వంటి ప్రయోజనాలు కూడా పొందవచ్చు.

రిలయన్స్ జియో రూ. 699 పోస్ట్‌పెయిడ్ ప్లాన్..

రిలయన్స్ జియో రూ.699 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో వినియోగదారులకు నెలకు 100GB డేటాను అందిస్తోంది. రూ.399 ప్లాన్ లాగానే, ఇది కూడా అదనంగా వినియోగించే ఒక్కో GB డేటాకు రూ.10 చెల్లించాల్సి ఉంటుంది. ఈ జియో ప్లాన్‌లో ముగ్గురికి యాడ్ ఆన్ సబ్‌స్క్రిప్షన్ ఇవ్వొచ్చు. ఒక్కో సిమ్‌లో 5GB డేటాను వస్తుంది. జియో నుంచి తీసుకున్న ప్రతి కొత్త SIM కోసం నెలకు రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు ప్రతిగా అపరిమిత వాయిస్ కాలింగ్ ఉచితంగా లభిస్తుంది. అంతేకాకుండా ప్రతి రోజూ 100 ఉచిత SMSలకు అవకాశం ఉంది.

ఈ ప్లాన్‌తో వినియోగదారులు అపరిమిత 5G డేటా ఆఫర్‌ను పొందుతారు. అదనంగా Netflix, Amazon Prime, JioTV, JioCinema, JioCloud ఉచిత సబ్‌స్క్రిప్షన్ పొందుతారు. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఈ ప్లాన్‌తో బేసిక్ సబ్‌స్క్రిప్షన్‌గా అందించబడుతుంది. ఒక సంవత్సరం పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందుతారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..