Reliance Industries: దేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో అరుదైన రికార్డు సాధించింది. ముఖేష్ అంబానీ (Mukesh Ambani)కి చెందిన ఈ సంస్థ 100 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.7.7 లోల కోట్లు) వార్షిక ఆదాయాన్ని అధిగమించిన ఏకైక దేశీయ కంపెనీగా పేరొందింది. నివేదికల ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏకీకృత నికర లాభం రూ.16,203 కోట్లకు చేరుకుంది. 2020-21 ఇదే త్రైమాసికం లాభం రూ.13.227 కోట్ల కంటే ఇది 22.5 శాతం ఎక్కువ. సంస్థ ఇన్‌కమ్ 35 శాతం పెరిగి 2.32 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
2021-22 అక్టోబర్-డిసెంబర్ లాభంతో పోల్చినట్లయితే 12.6 శాతం మేర తగ్గింది. 2021-22 పూర్తి ఆర్థిక సంవత్సరంలో సంస్థ నికర లాభం రూ.60,705 కోట్లు. ఆదాయం రూ.7.92 లక్షల కోట్లు (102 బిలియన్ డాలర్ల)కు చేరుకుంది. ఇక అన్ని కేటగిరిల్లో కలుపుకొని ఏడాదిలో 2.1 లక్షల మందికి పైగా కొత్త ఉద్యోగులను నియమించుకుంది. ఇక వడ్డీ పన్నులు, తరుదుల, తనఖా ముందు ఆదాయాలు మార్చి త్రైమాసికంలో రూ.33.968 కోట్లకు చేరుకున్నాయి. 2020-21 మార్చి త్రైమాసికంతో పోల్చుకున్నట్లయితే ఇది 28 శాతం అధికమనే చెప్పాలి.
వ్యాపారాల స్థూల ఆదాయాలు:
2021-22 వినియోగ వ్యాపారాల స్థూల ఆదాయాలు రూ.3 లక్షల కోట్లకు చేరుకోవడంతో ఈ వ్యాపార ఎబిటా రూ.50,000 కోట్లను అధిగమించింది. రూ.2 లక్షల కోట్ల వరకు ఆదాయమున్న రిటైల్ వ్యాపార ఎబిటా రూ.12,000 కోట్లను అధిగమించింది. డిజిటల్ సేవలు సైతం రూ.1 లక్ష కోట్ల ఆదాయంపై రూ.40,000 కోట్ల ఎబిటా నమోదు చేశాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి: