Instagram: ఇన్‌స్టాగ్రామ్‌కు 32 బిలియన్ల జరిమానా.. వివరాలు వెల్లడించిన డేటా ప్రొటెక్షన్ కమిషనర్

|

Sep 06, 2022 | 10:33 AM

Instagram: పిల్లల గోప్యత కోసం ఐర్లాండ్ రెగ్యులేటర్లు Instagram పై భారీ జరిమానా విధించారు. పిల్లల గోప్యత నిబంధనలను ఉల్లంఘించినందుకు ఇన్‌స్టాగ్రామ్‌కు 32 బిలియన్..

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌కు 32 బిలియన్ల జరిమానా.. వివరాలు వెల్లడించిన డేటా ప్రొటెక్షన్ కమిషనర్
Instagram
Follow us on

Instagram: పిల్లల గోప్యత కోసం ఐర్లాండ్ రెగ్యులేటర్లు Instagram పై భారీ జరిమానా విధించారు. పిల్లల గోప్యత నిబంధనలను ఉల్లంఘించినందుకు ఇన్‌స్టాగ్రామ్‌కు 32 బిలియన్ రూపాయల జరిమానా విధించింది. ఇన్‌స్టాగ్రామ్ పిల్లల ఫోన్ నంబర్‌లు, ఇమెయిల్ చిరునామాలకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపించారు. ఇది చాలా కాలంగా నడుస్తుండగా, దీనిపై ఇన్‌స్టాగ్రామ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. నివేదికల ప్రకారం.. కొంతమంది వ్యక్తులు ప్రొఫైల్ సందర్శనల వంటి విశ్లేషణాత్మక సాధనాలను యాక్సెస్ చేయడానికి వ్యాపార ఖాతాలను అప్‌గ్రేడ్ చేశారని ఆరోపించారు. ఇది వారి వ్యక్తిగత డేటాలో ఎక్కువ భాగాన్ని పబ్లిక్‌గా చేసింది. ఇందులో ఫోన్ నంబర్‌లు, ఇమెయిల్ చిరునామాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటా ఈ జరిమానాపై అప్పీల్ చేసేందుకు సిద్ధమైంది. అయితే రెగ్యులేటర్ల జరిమానాలను కంపెనీ ఎదుర్కొవడం ఇది మూడోసారి.

డేటా ప్రొటెక్షన్ కమిషనర్ ఏం చెప్పారంటే..

ఇన్‌స్టాగ్రామ్‌పై జరిమానాను వివరిస్తూ ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ కమిషనర్ (DPC) గత శుక్రవారం మా నిర్ణయం ఏంటో తెలిపాము. దీని కింద కంపెనీకి 405 మిలియన్ యూరోలు జరిమానా విధించబడిందని తెలిపారు. మీరు ఈ జరిమానాను భారతీయ రూపాయిలలోకి మార్చినట్లయితే, అది దాదాపు 32 బిలియన్.. 17 కోట్ల 44 లక్షల 15 వేల రూపాయలు. ఇక కంపెనీ అధికారులు మాట్లాడుతూ.. 18 ఏళ్లు పైబడిన వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో చేరితే, అతని ఖాతా ఆటోమేటిక్‌గా ప్రైవేట్‌గా మారుతుంది. దీని తర్వాత, అతనికి తెలిసిన వారు మాత్రమే అతని పోస్ట్‌ను చూడగలరు. ఆయన గురించి తెలియని వారు ఆయన పోస్ట్‌లను చూడలేరు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి