
భారీగా వ్యాపారం ఉన్న వారు ఎక్కువగా బ్యాంకుల్లో లావాదేవీలు సాగిస్తుంటారు. తరచూ బ్యాంకులకు వెళ్తుంటారు. అలాంటి సమయాల్లో బ్యాంక్‌లకు సెలవులు ఉంటే తాము జరపాల్సిన లావాదేవీల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకే బ్యాంక్‌ల సెలవుల సమాచారాన్ని ముందుగానే తెలుసుకుంటారు. అయితే ఇప్పుడు ఏప్రిల్ నెల ముగుస్తుండటంతో, రాబోయే మే నెలకు సంబంధించిన బ్యాంకు సెలవులకు సంబంధించి ఆర్బీఐ విడుదల చేసే సెలవుల జాబితా కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) మే 2025 నెలలో బ్యాంకు సెలవుల జాబితాను అధికారికంగా విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం, వచ్చే నెలలో వారాంతపు సెలవులైన శని, ఆదివారాలతో కలిసి మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.
అయితే బ్యాంక్‌లలో లావాదేవీలు జరిపేవారు ఈ సెలవులను దృష్టిలో పెట్టుకొని తమ పనులను ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే సెలవు దినాల్లో బ్యాంకు బ్రాంచ్‌లు మూసి ఉండటంతో కౌంటర్ సేవలు అందుబాటులో ఉండవు. కానీ ఈ సెలవు దినాల్లో ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, ఏటీఎం సేవలు వంటి డిజిటల్ లావాదేవీలకు ఎటువంటి అంతరాయం ఉండదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…