మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉందా.? దాని బిల్లును సకాలంలో చెల్లిస్తున్నారా.? లేక ఎప్పుడూ ఆలస్యంగానే బిల్లు పే చేస్తున్నారా.? ఒకవేళ మీరు క్రెడిట్ కార్డు బిల్లు ఆలస్యంగా చెల్లిస్తున్నట్లయితే.. టెన్షన్ వద్దు.. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధన తీసుకొచ్చింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సమయానికి డబ్బులు అకౌంట్‌లో లేకపోయినా.. ఏదైనా అత్యవసరం పడటమో.. లేదా మర్చిపోయినా.. ఇలా కారణాలు ఏదైనా కొంతమంది అప్పుడప్పుడూ క్రెడిట్ కార్డు బిల్లును ఆలస్యంగా చెల్లిస్తుంటారు. ఇక అలా చేయడం వల్ల ఆలస్య రుసుము, అదనపు వడ్డీ బిల్లుతో సహా ఎక్స్‌ట్రాగా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో సిబిల్ స్కోర్‌లో కూడా కోత పడుతుందని టెన్షన్ పడుతుంటారు. ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆర్బీఐ కొత్త రూల్‌ను అమలులోకి తీసుకొచ్చింది.
క్రెడిట్ కార్డు జారీ చేసే సంస్థలు.. బకాయి రోజుల సమాచారాన్ని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు ఇవ్వాలని.. పాస్ట్ డ్యూ డేట్ మూడు రోజులు దాటితేనే.. ఖాతాదారుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయాలని పేర్కొంది. దీని బట్టి చూస్తే.. బిల్లు చెల్లించే డేట్ దాటినా.. మూడు రోజుల్లోపు ఖాతాదారులు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా తమ బిల్లులు చెల్లించవచ్చు. లాస్ట్ డేట్ దాటిన మూడు రోజుల తర్వాత కూడా క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించకపోతేనే అదనపు ఛార్జీలు, ఆలస్య రుసుము వంటివి విధిస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..