తీవ్రమైన సవాళ్లు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ మెరుగైన స్థితిలో ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఈ రోజు బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB) వార్షిక బ్యాంకింగ్ కాన్ఫరెన్స్‌లో RBI గవర్నర్ శక్తికాంత దాస్ ప్రసంగిస్తూ భయంకరమైన ప్రపంచ పరిస్థితుల మధ్య భారత ఆర్థిక వ్యవస్థ సాపేక్షంగా మెరుగైన స్థితిలో ఉందన్నారు. ఇతర దేశాల కరెన్సీల కంటే భారత రూపాయి మెరుగైన స్థితిలో ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ధీమా వ్యక్తం చేశారు. రూపాయిలో పదునైన హెచ్చుతగ్గులు, అస్థిరతకు ఛాన్స్ లేదన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్‌లోకి US డాలర్లను సరఫరా చేస్తోంది.. తద్వారా తగినంత నగదు (ద్రవత్వం) సరఫరా చేయబడుతుంది. ఆర్‌బీఐ చర్యలు రూపాయి ట్రేడింగ్ సాఫీగా సాగేందుకు దోహదపడ్డాయి. ఇది కాకుండా, భద్రత లేని విదేశీ మారకపు లావాదేవీల గురించి భయాందోళనలకు బదులు, వాస్తవికంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు శక్తికాంత దాస్.
డిజిటల్ లెండింగ్ మార్గదర్శకాలు త్వరలో..
లిక్విడిటీ అవసరమైతే బ్యాంకులు క్రమంగా డిపాజిట్ రేట్లను పెంచుతాయని శక్తికాంత దాస్ చెప్పారు. డిజిటల్ లోన్ అంశంపై ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ.. దీనికి సంబంధించి మార్గదర్శకాలు త్వరలో వస్తాయని అన్నారు. తాము త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. కాబట్టి దీనికి చాలా సమయం పడుతోందని వెల్లడించారు
రెపో రేటు గురించి శక్తికాంత దాస్
రెపో రేటుపై ఓ ప్రశ్నకు సమాధానంగా, ఆర్‌బీఐ లిక్విడిటీ, రెపో రేట్లను పెంచడం, తదనుగుణంగా ఆర్‌బిఐ ద్రవ్య విధానం గురించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆర్‌బిఐ వృద్ధి లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుంటుందని ఆర్‌బిఐ గవర్నర్ అన్నారు.