Cardless Cash: ఏటీఎం లేకుండానే అన్ని బ్యాంకుల నుంచి డబ్బులు.. బ్యాంకులను కోరిన రిజర్వ్‌ బ్యాంకు

|

May 21, 2022 | 8:29 PM

Cardless Cash: బ్యాంకుల విషయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కొత్త కొత్త విధానాలను ప్రవేశపెడుతోంది. నగదు ఉపసంహరణ విషయంలో మరింత సులభతరం చేస్తోంది ..

Cardless Cash: ఏటీఎం లేకుండానే అన్ని బ్యాంకుల నుంచి డబ్బులు.. బ్యాంకులను కోరిన రిజర్వ్‌ బ్యాంకు
Follow us on

Cardless Cash: బ్యాంకుల విషయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కొత్త కొత్త విధానాలను ప్రవేశపెడుతోంది. నగదు ఉపసంహరణ విషయంలో మరింత సులభతరం చేస్తోంది ఆర్బీఐ. ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా మరింత సులభతరం చేయాలని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) భావిస్తోంది. ఇందులో భాగంగా కార్టు లేకుండానే ఖాతాతారులు ఏ బ్యాంకు ఏటీఎం నుంచైనా డబ్బులను తీసుకునే వెసులుబాటు కల్పించేందుకు సిద్ధమైంది. ఈ కార్డులెస్‌ విధానాన్ని పరిశీలించాలని బ్యాంకులను కోరింది ఆర్బీఐ. అన్ని ఏటీఎంల్లో ఇంటరాపరబుల్‌ కార్డ్‌లెస్‌ క్యాష్‌ విత్‌డ్రాయల్‌ (ICCW) ఆప్షన్‌ ద్వారా ఖాతాదారులకు ఈ వెసులుబాటు కల్పించాలని కోరింది.

నేరాలకు చెక్‌ పెట్టువచ్చు..

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం కొన్ని బ్యాంకులు, తమ ఖాతాదారులకు మాత్రమే తమ సొంత ఏటీఎంల వద్ద ఈ సదుపాయం కల్పిస్తున్నాయి. దీన్ని అన్ని బ్యాంకుల ఖాతాదారులకు కల్పించాలని ఆర్‌బీఐ కోరింది. ఇలా చేయడం ద్వారా స్కిమ్మింగ్‌, కార్డు క్లోనింగ్‌, డివైస్‌ ట్యాంపరింగ్‌ వంటి నేరాకు చెక్‌ పెట్టవచ్చని ఆర్బీఐ భావిస్తోంది. ఇందుకోసం ఎన్‌పీసీఐ తమ యూపీఐ వ్యవస్థను అన్ని బ్యాంకులు, ఏటీఎం నెట్‌వర్క్‌లతో అనుసంధానం చేయాలని బ్యాంకులను కోరింది ఆర్బీఐ.