ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రాజీనామా.. ఆరు నెలలకు ముందే

| Edited By:

Jun 24, 2019 | 11:03 AM

పదవీ కాలం ముగియకుండానే రిజర్వు బ్యాంక్ డిప్యూటీ గవర్నర్‌లలో ఒకరైన విరాల్ ఆచార్య తన పదవికి రాజీనామా చేశారు. జనవరి 23, 2017లో ఆర్బీఐలో చేరిన విరాల్‌కు మరో ఆరు నెలల పదవీకాలం ఉంది. అయితే ఈ నెల ఆరంభంలో జరిగిన పరపతి సమీక్ష సమావేశానికి కొన్ని రోజుల ముందే ఆయన తన రాజీనామాను సమర్పించినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో గతంలో ఆయన పనిచేసిన న్యూయార్క్ యూనివర్సిటీ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు తిరిగి […]

ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రాజీనామా.. ఆరు నెలలకు ముందే
Follow us on

పదవీ కాలం ముగియకుండానే రిజర్వు బ్యాంక్ డిప్యూటీ గవర్నర్‌లలో ఒకరైన విరాల్ ఆచార్య తన పదవికి రాజీనామా చేశారు. జనవరి 23, 2017లో ఆర్బీఐలో చేరిన విరాల్‌కు మరో ఆరు నెలల పదవీకాలం ఉంది. అయితే ఈ నెల ఆరంభంలో జరిగిన పరపతి సమీక్ష సమావేశానికి కొన్ని రోజుల ముందే ఆయన తన రాజీనామాను సమర్పించినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో గతంలో ఆయన పనిచేసిన న్యూయార్క్ యూనివర్సిటీ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు తిరిగి వెళుతున్నట్లు సమాచారం.

అయితే ఆర్థిక సమీకరణ విధాల అమలు తరువాత ఆర్బీఐలో చేరిన డిప్యూటీ గవర్నర్‌లలో విరాల్ అత్యంత చిన్న వయస్కుడు. ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య తీవ్ర సంక్షోభ పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఆర్బీఐకి స్వతంత్రత ఉండాల్సిందేనని ఆయన తన నినాదాన్ని గట్టిగా వినిపించారు. అంతేకాదు ఆర్బీఐ నిర్ణయాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని విరాల్ అప్పట్లో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపిన విషయం తెలిసిందే.