
భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) సెంట్రల్ బోర్డ్‌ను విస్తరిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బోర్డులో కొత్తగా ముగ్గురు పారితోషికేతర (non-official) సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐక్యరాజ్యసమితి (UN)లో భారతదేశ మాజీ శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్, ప్రముఖ అర్థశాస్త్రవేత్త జన్మేజయ కుమార్ సిన్హా, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మాజీ సీనియర్ అధికారిణి అన్నీ జార్జ్ మాథ్యూలు ఈ నూతన సభ్యులుగా ఎంపికయ్యారు. కేబినెట్ నియామకాల కమిటీ (ACC) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1934 లోని సెక్షన్ 8(1)(సి) ప్రకారం ఈ నియమకాలను ఆమోదించింది. శనివారం సిబ్బంది, శిక్షణా శాఖ (DoPT) జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వచ్చాయి.
కొత్తగా ఎంపికైన ఈ ముగ్గురు సభ్యులు నాలుగేళ్ల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ పదవుల్లో కొనసాగుతారు. ఇటీవలె ఆనంద్ మహీంద్రా, ఇస్రో (ISRO) ఛైర్మన్ ఎస్. సోమనాథ్‌లను కూడా ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్‌లోకి తీసుకున్న విషయం తెలిసిందే. తాజా నియామకాలతో ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ సభ్యుల సంఖ్య 11 నుంచి 14కు పెరిగింది.
ఇది కూడా చదవండి: Gold Price: మహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..!
ఇది కూడా చదవండి: Eye Glasses: కళ్లద్దాలు వాడితే కంటి పవర్ పెరుగుతుందా? చాలా మందికి ఉన్న పెద్ద అపోహా ఏంటి?
ఇది కూడా చదవండి: BSNL Offer: బీఎస్‌ఎన్‌ఎల్ అదిరిపోయే ప్లాన్.. చౌకైన రీఛార్జ్‌తో 412 రోజుల వ్యాలిడిటీ..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి