RBI: రిజర్వ్ బ్యాంక్ ఇఫ్ ఇండియా (RBI) బ్యాంకులపై కొరఢా ఝులిపిస్తోంది. నిబంధనలు పాటించని బ్యాంకుల లైసెన్స్‌లు రద్దు చేయడం, భారీ జరిమానా విధించడం, ఇతర ఆంక్షలు విధిస్తూ చర్యలు చేపడుతోంది. ఇక తాజాగా మరో బ్యాంకు (Bank)కు భారీ షాకిచ్చింది ఆర్బీఐ. మహారాష్ట్రకు చెందిన ఇండిపెండెన్స్ కో ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ లైసెన్స్‌ను ఆర్బీఐ రద్దు చేసింది. నిబంధనలు పాటించనందున బ్యాంకింగ్ కార్యకలాపాలను సీజ్ చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. ఇవి ఫిబ్రవరి 3 నుంచి అమల్లోకి వచ్చినట్లు ఆర్బీఐ ఒక ప్రకనటనలో తెలిపింది.
బ్యాంకు ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని గత సంవత్సరం కొన్ని ఆంక్షలు విధించామని తెలిపింది. ఈ నిర్ణయంతో ఆరు నెఎలల వకకు వినియోగదారులు విత్‌డ్రా చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. అయితే గత ఏడాది ఆంక్షలు విధించినా బ్యాంకు ఆర్థిక పరిస్థితులు మెరుగు పడకపోవడంతో లైసెన్స్ రద్దు చేయాలని నిర్ణయించినట్లు ఆర్బీఐ తెలిపింది. బ్యాంకు వద్ద సరిపోయే మూలధనం లేదని, రానున్న రోజుల్లో ఆదాయాలు వచ్ఏచ అవకాశాలు కూడా లేవని తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో కస్టమర్ల, డిపాజిటర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ బ్యాంకు లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది.
కాగా, నిబంధనల కింద కస్టమర్ల డిపాజిట్లను వెనక్కి ఇచ్చే చర్యలను చేపట్టాలని బ్యాంకుకు రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. రూ.5 లక్షల వరకు ఉన్న డిపాజిట్లను కస్టమర్లకు వెనక్కి ఇచ్చేయాలని, బ్యాంకు డేటా ప్రకారం.. రూ.5 లక్షలు లేదా అంతకంటే తక్కువ డిపాజిట్ చేసిన 99 శాతం ఖాతాదారులకు పూర్తి డబ్బులు వెనక్కి వస్తాయని ఆర్బీఐ తెలిపింది.
ఇవి కూడా చదవండి: