Ramesh Damani: పెట్టుబడిదారులకు రమేష్ దామనీ చిట్కాలు.. పాటిస్తే రాబడి వరదే..!

|

Dec 16, 2024 | 8:00 AM

ఇటీవల కాలంలో పెరిగిన ఆర్థిక అక్షరాస్యత నేపథ్యంలో చాలా మంది పెట్టుబడిదారులు సంప్రదాయ పెట్టుబడులు కాకుండా స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిల్లో పెట్టుబడిని ఇష్టపడుతున్నారు. అయితే ఈ పెట్టుబడులు రిస్క్‌తో కూడకున్నవి. సరైన అవగాహన లేకపోతే పెద్ద మొత్తంలో నష్టపోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ రంగంలో ప్రముఖ పెట్టుబడిదారులుగా ఉన్న వారి సలహాలను పరిశీలిద్దాం.

Ramesh Damani: పెట్టుబడిదారులకు రమేష్ దామనీ చిట్కాలు.. పాటిస్తే రాబడి వరదే..!
Ramesh Damani
Follow us on

పెట్టుబడి ప్రపంచంలోకి ప్రవేశించిన వారు పెట్టుబడికి సంబంధించిన అనేక పద్ధతులను నేర్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో గైడ్ చేసే వారు కచ్చితంగా ఉంటే మెరుగైన రాబడిని పొందవచ్చు. ప్రముఖ పెట్టుబడిదారుడు రమేష్ దమానీ యువ పెట్టుబడిదారులకు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా పెట్టుబడి ప్రపంచంలో రమేష్ దమానీ పేరు పరిచయం అవసరం లేని పేరుగా ఉంటుంది. రమేష్ బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ అంటే బీఎస్ఈ సభ్యుడిగా ఉన్నారు. పెట్టుబడి రంగంలో ఎందరో కొత్త వ్యక్తులకు స్ఫూర్తిని, మార్గదర్శకత్వాన్ని అందించారు. ప్రస్తుతం ఆయన కంపెనీల నికర విలువ రూ. 173.2 కోట్లుగా ఉంది. 

ఇటీవల ముంబైలో నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో దమానీ కొత్త పెట్టుబడిదారులకు తన అనుభవాలు, చిట్కాలను అందించారు.  పెట్టుబడిదారులు ముఖ్యంగా దీర్ఘకాలిక దృష్టితో మాత్రమే పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా త్వరగా డబ్బు సంపాదించాలనే తపనలో మీరు చాలా నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. దమానీ 1989లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించినప్పుడు సెన్సెక్స్ 1,000 వద్ద ఉంది. నేడు అది 80,000గా ఉంది. అందువల్ల ధీర్ఘకాల వృద్ధిని ఆలోచించి మంచి వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం ఎల్లప్పుడూ లాభదాయకంగా ఉంటుందని చెబుతున్నారు.  మార్కెట్ ఎన్నిసార్లు పడిపోయినా దాని గురించి కంగారు పడకుండా మంచి రాబడులు వచ్చేలా వేచి ఉండాలి. దమానీ కొత్త పెట్టుబడిదారులకు ఉద్దేశించి మాట్లాడుతూ మీరు ట్రేడింగ్ చేయాలనుకుంటే మీ మొత్తం పెట్టుబడిలో 5-10 శాతం మాత్రమే ట్రేడింగ్‌లో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. 

మిగిలిన 90 శాతం డబ్బును మంచి రాబడి వచ్చే వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టాలని వివరిస్తున్నారు. పెట్టుబడి వ్యూహానికి వారెన్ బఫెట్ ఆదర్శవంతమైన ఉదాహరణ అని తెలిపారు. సరైన నిర్ణయాలు, క్రమశిక్షణతో కూడిన పెట్టుబడితో మీరు లక్షాధికారి కావచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా ట్రేడింగ్ ద్వారా మిలియనీర్ అయ్యే అవకాశాలు చాలా తక్కువని, లక్షల మందిలో 1 నుంచి 2 మంది మాత్రమే ఇందులో విజయం సాధిస్తారు. ట్రేడింగ్‌లో పెట్టుబడి అనేది థ్రిల్ కోసమే పెట్టాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా పెట్టుబడుల సమ్మేళనం అనేది పెట్టుబడికి అత్యంత శక్తివంతమైన ఆయుధంగా దమానీ అభివర్ణించారు. మీరు డబ్బును సరిగ్గా నిర్వహిస్తే 10 నుంచి 20 సంవత్సరాలలో మీ ఆర్థిక స్థితి పూర్తిగా మారిపోవచ్చని ఆయన అన్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి