Anand Mahindra: ఆనంద్ మహీంద్రాను ఆకట్టుకున్న ప్రభాస్ బుజ్జీ.. ఎక్స్‌లో వైరల్ అవుతున్న డ్రైవింగ్ వీడియో

తాజాగా ప్రభాస్ లేటెస్ట్ సినిమా కల్కి2898 ఏడీ కోసం అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో బుజ్జీ పేరుతో వాడిన ప్రత్యేక కారు అందరినీ ఆకర్షిస్తుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ కారును వివిధ ప్రాంతాల్లో ప్రదర్శిస్తున్నారు. తాజాగా మహీంద్రా & మహీంద్రా చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా దగ్గరకు ఈ కారును తీసుకెళ్లారు. ఈ కారును ఆనంద్ మహీంద్రాను విపరీతంగా ఆకర్షించింది.

Anand Mahindra: ఆనంద్ మహీంద్రాను ఆకట్టుకున్న ప్రభాస్ బుజ్జీ.. ఎక్స్‌లో వైరల్ అవుతున్న డ్రైవింగ్ వీడియో
Anand Mahindra With Bujji

Updated on: Jun 15, 2024 | 6:00 PM

బాహుబలి సినిమా తర్వాత ప్రముఖ టాలివుడ్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా మారారు. బాహుబలి తర్వాత ప్రతి సినిమాను ప్రభాస్ అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారంటే ప్రభాస్ క్రేజ్ మనం అర్థం చేసుకోవచ్చు. తాజాగా ప్రభాస్ లేటెస్ట్ సినిమా కల్కి2898 ఏడీ కోసం అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో బుజ్జీ పేరుతో వాడిన ప్రత్యేక కారు అందరినీ ఆకర్షిస్తుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ కారును వివిధ ప్రాంతాల్లో ప్రదర్శిస్తున్నారు. తాజాగా మహీంద్రా & మహీంద్రా చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా దగ్గరకు ఈ కారును తీసుకెళ్లారు. ఈ కారును ఆనంద్ మహీంద్రాను విపరీతంగా ఆకర్షించింది. ప్రస్తుతం ఈ వీడియో ఎక్స్‌లో హల్ చల్ చేస్తుంది. ఈ వీడియో గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

కల్కి 2898 ఏడీలో వాడి బుజ్జీ కారు ఒక భారీ ఎలక్ట్రిక్ వాహనం. ఈ కారు చూశాక భారతదేశంలో ఈవీ కార్ల వృద్ధి తెలుస్తుందని ఆనంద్ మహీంద్రా ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ కారును భవిష్యత్ ‘టార్జాన్..ది వండర్ కార్‌గా అభివర్ణించారు. ఈ సినిమా కోసమే ప్రత్యేకంగా తయారు చేసిన ఈ ఐకానిక్ కారు వెండితెరపై చెరగని ముద్ర వేస్తుందనడంతో అతిశయోక్తి లేదని సినీ ప్రముఖులు చెబుతున్నారు. ఈ వీడియోలో ఆనంద్ మహీంద్రా భారీ ఎలక్ట్రిక్ కారును నడిపారు. ఈ కారుకు సంబంధించిన భారీ క్రేన్ లాంటి టైర్లను చూసి ఆశ్రర్యానికి గురయ్యారు. ఈ కారను కోయంబత్తూరులోని మహీంద్రా బృందంతో పాటు జయేమ్ ఆటోమోటివ్స్ మధ్య సహకారంతో రూపొందించారు. 

ఇవి కూడా చదవండి

కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ కారు కోసం మహీంద్రాను సంప్రదించడంతో ఈ అద్భుతమైన కారు రూపకల్పనకు అడుగులు పడ్డాయి. ముఖ్యంగా మహీంద్రా కంపెనీ ఈ కారు కోసం తన వనరులను సమీకరించింది6075 ఎంఎం పొడవు, 3380 ఎంఎం వెడల్పు, 2186 ఎంఎం ఎత్తు, 180 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్‌తో వచ్చే కారు మొత్తం బరువు6000 కిలోలు. అంత బరువు ఉన్నా ‘బుజ్జి’ పూర్తిగా ఎలక్ట్రిక్, రెండు మోటార్లు కలిపి 94 కేడబ్ల్యూ, 9,800 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి