Investment Tips: నెలకు రూ.1900తో రూ.కోటి సంపాదన మీ సొంతం.. జస్ట్ ఈ పని చేస్తే చాలు..

దేశంలో అత్యంత పాపులర్ అయిన పథకాల్లో పీపీఎఫ్ ఒకటి. ఇందులో పిల్లల పేర్లపై తల్లిదండ్రులు అకౌంట్ తెరిచే అవకాశముంది. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఇతర ఆర్ధిక అవసరాల కోసం కూ.కోటి వరకు పొందవచ్చు. దీర్ఠకాలం పాటు ఇన్వెస్ట్ చేయడం వల్ల రూ.కోటి వరకు సమకూరుతుంది.

Investment Tips: నెలకు రూ.1900తో రూ.కోటి సంపాదన మీ సొంతం.. జస్ట్ ఈ పని చేస్తే చాలు..
Ppf

Updated on: Jul 18, 2026 | 8:40 AM

కేంద్ర ప్రభుత్వం అనేక పొదుపు పథకాలను అమలు చేస్తోంది. అందులో అత్యంత పాపులర్ స్కీమ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్). ఈ స్కీమ్ గురించి తెలియనివారంటూ ఎవరూ ఉండరు. దేశంలో లక్షలాది మంది ఇందులో పెట్టుబడులు పెడుతున్నారు. మంచి వడ్డీ రేటుతో పాటు పన్ను ప్రయోజనాలు, రుణం సౌకర్యం ఇందులో పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వ పథకం కావడంతో మీ నగదుకు భద్రత కూడా ఉంటుంది. పిల్లల పేరు మీద కూడా ఈ అకౌంట్ ఓపెన్ చేసే సౌకర్యం అందుబాటులో ఉంది. పిల్లల పేరుపై ఈ అకౌంట్ చిన్న వయస్సులోనే తెరిస్తే వాళ్లు పెద్దయ్యాక చదువులు, పెళ్లిళ్లు, ఇతర ఆర్ధిక అవసరాల కోసం ఉపయోగపడతాయి. అందుకే చిన్న వయస్సులోనే తెరవడం మంచిది. చిన్న పిల్లల పేరుపై ఈ అకౌంట్ ఎలా తెరవాలి..? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పిల్లల పేరుపై ఎలా ఓపెన్ చేయాలి..?

పిల్లల కోసం చాలామంది తల్లిదండ్రులు డబ్బులు పొదుపు చేస్తూ ఉంటారు. పిల్లల చదువులు, పెళ్లి, ఇతర భవిష్యత్ అవసరాల కోసం పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ఫిక్స్ డ్ డిపాజిట్లు, పోస్టాఫీస్, ఇతర ప్రభుత్వ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. వీటిల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఒకటి. ఈ స్కీమ్‌లో తక్కువ మొత్తం నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. స్తోమతను బట్టి డబ్బులు డిపాజిట్ చేయవచ్చు. పిల్లల పేరు మీద తల్లిదండ్రులు ఈ అకౌంట్ తెరవొచ్చు. ప్రస్తుతం ఈ పథకం వడ్డీ రేటు 7.10 శాతంగా ఉంది. వరుసగా 15 ఏళ్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత అవసరమైతే ఐదేళ్ల చొప్పున పొడిగించుకుంటూ వెళ్లవచ్చు. ఇలా ఎన్ని ఏళ్లు అయినా పెట్టుబడులు పెట్టే అవకాశముంది. ఒక ఆర్ధిక సంవత్సరంలో మినిమం రూ.500 నుంచి గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. వీటిని ఒకేసారి జమ చేయకుండా లేదా ప్రతీ నెలా కట్టవచ్చు. ఇందులో పెట్టే పెట్టుబడి, వడ్డీ, మెచ్యూరిటీ రిటర్న్స్‌పై ఎటువంటి ట్యాక్స్ ఉండదు.

కోటీశ్వరులు కావాలంటే..?

పిల్లలు పుట్టగానే ఏడాదిలోపు ఈ స్కీమ్‌లో చేరాలి. ప్రతీ నెల రూ.1900 పెట్టుబడి పెడితే 50 ఏళ్లల్లో రూ.1.02 కోట్లు అవుతాయి. మీరు పెట్టే పెట్టుబడి రూ.11.40 లక్షలు మాత్రమే. వాటిపై వచ్చే వడ్డీ కలుపుకుంటే రూ.కోటి అవుతుంది. ఇక ఐదేళ్ల వయస్సులో చేరితే నెలకు రూ.2700 చొప్పును ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడు 45 ఏళ్లల్లో వడ్డీతో సహా రూ.1.02 కోట్లు సమకూరుతాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us