Post Office: ధీర్ఘకాలిక పెట్టుబడులకి పోస్టాఫీసు మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఇవి పేద, మధ్య తరగతి వర్గాలకి అనువుగా ఉంటాయి. తక్కువ మొత్తంతో ఎక్కువ రాబడి సంపాదించవచ్చు. ఇందులో ఖాతా తెరవడం కూడా చాలా సులభం. అయితే స్టాక్ మార్కెట్, మ్యూచ్‌ఫల్ పండ్స్ వాటితో పోలిస్తే తక్కువ రాబడి ఇచ్చినప్పటికీ మీ డబ్బుకి పటిష్ట భద్రత ఉంటుంది. కచ్చితమైన హామితో కూడాన ఆదాయం లభిస్తుంది. అటువంటి పోస్టాఫీసు పథకాలలో కిసాన్ వికాస పత్ర ఒకటి. ఈ పథకం 1988లో ప్రారంభించారు. అప్పట్లో ఈ పథకంలో రైతులు ఎక్కువగా పెట్టుబడి పెట్టేవారు. ఎందుకంటే ఇందులో పెట్టిన పెట్టుబడి రెట్టింపు అవుతుంది. ఇప్పుడు ఈ పథకం అందరికీ అందుబాటులోకి వచ్చింది. కిసాన్ వికాస్ పత్ర అనేది ఒక పెట్టుబడి పథకం. ఈ పథకం కాలవ్యవధి 124 నెలలు అంటే 10 సంవత్సరాల 4 నెలలు. మీరు ఈ స్కీమ్‌లో 1 ఏప్రిల్ 2022 నుంచి 30 జూన్ 2022 వరకు పెట్టుబడి పెట్టినట్లయితే మీరు డిపాజిట్ చేసిన మొత్తం 10 సంవత్సరాల 4 నెలల్లో రెట్టింపు అవుతుంది. ఈ పథకం కింద మీరు 6.9% వార్షిక చక్రవడ్డీని పొందుతారు. మీరు కనీసం రూ.1,000 పెట్టుబడితో కిసాన్ వికాస్ పత్ర సర్టిఫికేట్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ పథకంలో గరిష్ట పెట్టుబడికి పరిమితి లేదు. అంటే ఈ పథకంలో ఎంత డబ్బు కావాలంటే అంత పెట్టుబడి పెట్టవచ్చు.
పాన్, ఆధార్ తప్పనిసరి
ఈ నిర్దిష్ట పథకంలో పెట్టుబడికి పరిమితి లేనందున మనీ లాండరింగ్ ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం 2014లోరూ. 50,000 కంటే ఎక్కువ పెట్టుబడులకి పాన్ కార్డును తప్పనిసరి చేసింది. ఇది కాకుండా మీరు గుర్తింపు కార్డును కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరైనా రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెడితే ఐటీఆర్, సాలరీ స్లిప్, బ్యాంక్ స్టేట్‌మెంట్ మొదలైన ఆదాయ పత్రాలని సమర్పించాలి.
మూడు ఎంపికలు
1. సింగిల్ హోల్డర్ టైప్ సర్టిఫికేట్: ఈ రకమైన సర్టిఫికేట్ మైనర్ కోసం కొనుగోలు చేస్తారు.
2. జాయింట్ ఎ అకౌంట్ సర్టిఫికేట్: ఇది ఇద్దరు పెద్దలకు ఉమ్మడిగా జారీ చేస్తారు.
3. జాయింట్ బి అకౌంట్ సర్టిఫికేట్: ఇది కూడా ఇద్దరు పెద్దలకు ఉమ్మడిగా జారీ చేస్తారు. రిటర్న్స్ ఒక్కరికి మాత్రమే చెల్లిస్తారు.
గమనిక: ఇక్కడ అందిస్తున్న ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఆర్ధిక నిపుణులు వెల్లడించిన అభిప్రాయాలు.. ఆయా కంపెనీల పనితీరుపై నిపుణులు అందించిన సమాచారం ఆధారంగా ఈ ఆర్టికల్ అందిస్తున్నాం. స్టాక్స్, ఫండ్స్, ఇన్సూరెన్స్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టేముందు ఆర్ధిక నిపుణుల సలహా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.