Post Office: పోస్టాఫీసులో సేవింగ్స్‌ ఖాతాను ఎవరెవరు తెరవవచ్చు.. వడ్డీ రేటు ఎంత..? పూర్తి వివరాలు

|

May 07, 2022 | 8:36 AM

Post Office: మీరు రాబోయే రోజుల్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్‌లలో చేయవచ్చు. ఈ పథకంలో చేరితే ఖచ్చితంగా మంచి రాబడిని పొందుతారు..

Post Office: పోస్టాఫీసులో సేవింగ్స్‌ ఖాతాను ఎవరెవరు తెరవవచ్చు.. వడ్డీ రేటు ఎంత..? పూర్తి వివరాలు
Follow us on

Post Office: మీరు రాబోయే రోజుల్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్‌లలో చేయవచ్చు. ఈ పథకంలో చేరితే ఖచ్చితంగా మంచి రాబడిని పొందుతారు. అలాగే ఇందులో పెట్టుబడి పెట్టిన డబ్బు సురక్షితంగా ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలలో పెట్టుబడిని చాలా తక్కువ మొత్తంతో ప్రారంభించవచ్చు. పోస్ట్ ఆఫీస్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌లలో పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా కూడా ఉంటుంది.

వడ్డీ రేటు:

ప్రస్తుతం పోస్టాఫీసులోని సేవింగ్స్ ఖాతాపై 4.0 శాతం వడ్డీ రేటు అందుబాటులో ఉంది. పొదుపు ఖాతా తెరవాలంటే కనీసం రూ.500 పెట్టుబడి పెట్టాలి.

ఎవరు ఖాతా తెరవచ్చు..?

పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతాలో ఒక వ్యక్తి ఒకే ఖాతాగా ఓపెన్‌ చేసే సదుపాయం ఉంది. ఇందులో మైనర్ లేదా 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల పేరుపై తెరవవచ్చు. అలాగే మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తి తరపున సంరక్షకులు ఖాతాను ఓపెన్‌ చేయవచ్చు. జాయింట్ అకౌంట్ హోల్డర్ మరణిస్తే, జీవించి ఉన్న ఖాతాదారుడే ఏకైక హోల్డర్. అయితే జీవించి ఉన్న హోల్డర్ తన స్వంత పేరుతో ఇప్పటికే ఒకే ఖాతాను కలిగి ఉన్నట్లయితే, అప్పుడు జాయింట్ ఖాతాను మూసివేయాలి. జాయింట్ ఖాతా నుండి సింగిల్‌కి, సింగిల్ నుండి జాయింట్‌కి మార్చడం అనుమతి ఉండదు.ఖాతా తెరిచే సమయంలో నామినేషన్ తప్పనిసరి. ఖాతా ఓపెన్‌ చేసే వ్యక్తి అతని పేరు మీద KYC పత్రాలను సంబంధిత పోస్టాఫీసుకు సమర్పించాలి. ఈ పథకంలో కనీసం 50 రూపాయలు విత్‌డ్రా చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

Petrol-Diesel Price Today: వాహనదారులకు ఊరట.. తాజా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..!

Fixed Deposit: ఆ బ్యాంకు కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు.. ఇదే బాటలో మరిన్ని బ్యాంకులు