సంపాదించే దాంట్లో ఎంతో కొంత పొదుపు చేయాలని ప్రతీ ఒక్కరూ ఆలోచిస్తుంటారు. ఆదాయాలకు అనుగుణంగా ఎంతో కొంత సేవింగ్ చేస్తుంటారు. ఇటీవలి కాలంలో ప్రజల్లో అవగాహన పెరుగుతోన్న నేపథ్యంలో రకరకాల పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన పోస్టాఫీస్ ఎన్నో రకాల సేవింగ్ స్కిమ్స్‌ను అందుబాటుటులోకి తీసుకొస్తోంది.
ఈ క్రమంలోనే పోస్టాఫీస్ తీసుకొచ్చిన బెస్ట్ స్కీమ్స్‌లో కిసాన్ వికాస్ పథకం ఒకటి. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా సెక్యూరిటీతో పాటు, మంచి రిటర్న్స్ పొందొచ్చు. ఈ పథకంప ప్రభుత్వం 7.5 శాతం వడ్డీని అందిస్తుంది. రూ. 1000తో ఈ పథకంలో పెట్టుబడి పెట్టొచ్చు. ఇక ఈ స్కీమ్‌లో పెట్టబడికి గరిష్ట పరిమితి అంటూ ఏమి లేదు. జాయింట్ ఖాతా కూడా ఓపెన్ చేసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. 10 ఏళ్లు పైబడిన ఎవరైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టొచ్చు.
ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం వల్ల మీ ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు 9 ఏళ్ల 7 నెలలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అంటే మొత్తం 115 నెలలపాటు డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ పథకంలో రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ పీరియడ్ తర్వాత రూ. 10 లక్షలు పొందొచ్చు. నిజానికి తొలుత 120 నెలలుగా ఉండేది అయితే ప్రభుత్వం తాజాగా దీనిని 115 నెలలకు కుదించింది.
ఇక కిసాస్ పత్ర యోజన ఖాతాను స్థానికంగా ఉన్న పోస్టాఫీస్‌లో ఓపెన్ చేసుకోవచ్చు. ఇందుకోసం అప్లికేషన్ ఫాన్‌ను నింపాల్సి ఉంటుంది. అనంతరం మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న మొత్తాన్ని చెక్, నగదు లేదా డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించవచ్చు. ఈ పొదుపు పథకంలో వడ్డీ రేటును ప్రతీ మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వం సమీక్షిస్తుంది, అవసరాన్ని బట్టి మార్పులు చేస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..