
Post Office Gram Suraksha Scheme: నెలాఖరున జీతం లేదా సంపాదన ఎంత ఉన్నప్పటికీ, భవిష్యత్తులో ఎవరి ముందూ చేతులు చాచాల్సిన అవసరం లేకుండా ఉండేందుకు పొదుపు చేయడం అవసరం. కానీ ఈ ద్రవ్యోల్బణ యుగంలో రోజువారీ జీవితంలోని అన్ని ఖర్చులను భరిస్తూ పొదుపు చేయడం ఎల్లప్పుడూ సాధ్యం కాదు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని, మీకు తపాలా కార్యాలయం వారి ఒక పథకం గురించి తెలియజేస్తున్నాము. దీని ద్వారా మీరు ప్రతిరోజూ కేవలం 50 రూపాయలు పొదుపు చేయడం ద్వారా 35 లక్షల వరకు నిధిని సృష్టించుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పథకమే ‘గ్రామ సురక్షా యోజన’. దీని గురించి తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి: Multibagger Stock: కేవలం ఐదేళ్లలో లక్ష రూపాయలను రూ.40 లక్షలుగా మార్చిన స్టాక్..!
పోస్ట్ ఆఫీస్ గ్రామ సురక్షా యోజన అనేది గ్రామీణ తపాలా జీవిత బీమా (RPLI) కింద ప్రభుత్వం నడిపే ఒక పూర్తి జీవిత బీమా పాలసీ. దీనిని బీమా, దీర్ఘకాలిక పొదుపుల కలయికగా చూడవచ్చు. ఇది చిన్న పెట్టుబడిపై మంచి రాబడిని అందిస్తుంది.
ఈ పథకం కింద 80 ఏళ్లు నిండిన వ్యక్తికి మెచ్యూరిటీ మొత్తాన్ని అందిస్తారు. ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే.. ఈ మొత్తాన్ని నామినీకి అందిస్తారు. పథకంలో చేరిన మూడు సంవత్సరాల తరవాత పాలసీదారుడు ఈ పథకాన్ని నిలిపేయవచ్చు. అయితే పథకంలో చేరిన 5 సంవత్సరాల లోపు సరెండర్ చేస్తే బోనస్ రాదు. పథకంలో చేరిన నాలుగు సంవత్సరాల తర్వాత లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ పాలసీలో అతిపెద్ద హైలైట్ తపాలా శాఖ అందించే బోనస్. తపాలా శాఖ ప్రకటించిన ప్రకారం ప్రతి రూ.1,000కి సంవత్సరానికి రూ.60ల బోనస్ అందుతుంది.
ఈ గ్రామ సురక్ష యోజన స్కీమ్‌లో చేరిన వ్యక్తి ప్రతి నెలకు ఎంత కట్టాలి అనేది మీ వయసు, మెచ్యూరిటీ పీరియడ్, బీమా మొత్తం వంటి వాటి మీద ఆధారపడి ఉంటుందని గుర్తించుకోండి. ఉదాహరణకు ఒక వ్యక్తి 19 సంవత్సరాల వయస్సులో రూ.10 లక్షల బీమా పాలసీ తీసుకుని 55 ఏళ్ల మెచ్యూరిటీ ఎంచుకుంటే అతను నెలకు రూ.1,515 లను ప్రీమియంగా చెల్లించాలి. అంటే రోజుకు 50 రూపాయలు. అతను 58 సంవత్సరాలు అయితే నెలకు రూ.1,463, 60 సంవత్సరాల వరకు స్కీమ్‌లో ఉంటే నెలకు రూ.1,411లను చెల్లించాలి. ప్రీమియం సకాలంలో చెల్లించకపోతే 30 రోజుల్లోపు డిపాజిట్ చేయవచ్చు.
మీరు స్కీమ్‌లో ఎన్ని సంవత్సరాలు పొదుపు చేశారు.. అనే దాని ఆధారంగా రాబడిని నిర్ణయిస్తారని గుర్తించుకోండి. మీరు 55 ఏళ్ల వరకు స్కీమ్‌లో పెట్టుబడి పెడితే మీకు రూ.31.60 లక్షలు, అదే 58 ఏళ్లు అయితే 32.40 లక్షలు, 60 ఏళ్ల వయస్సు వరకు పెట్టుబడి పెడితే రూ.34 లక్షలు మెచ్యూరిటీ సమయంలో వస్తాయి.
ఇది కూడా చదవండి: Bank Holidays: వినియోగదారులకు బిగ్ అలర్ట్.. జూలైలో 12 రోజులు బ్యాంకులు బంద్..!
ఇది కూడా చదవండి: Bank FD: మీరు ఈ బ్యాంకులో రూ.5 లక్షల ఎఫ్‌డీ చేస్తే 60 నెలల్లో ఎంత ఆదాయం వస్తుంది?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి