POCO F3 GT: కస్టమర్లను ఆకట్టుకునేందుకు వివిధ రకాల స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు కొత్త కొత్త మోడళ్ల ఫోన్‌లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. తాజాగా పోకో ఎఫ్3 జీటీ పేరుతో మార్కెట్లో విడుదల కానుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్టు 10 లోపు విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఖచ్చితమైన విడుదల తేదీని మాత్రం ప్రకటించలేదు. ఇటీవల చైనాలో లాంచ్ అయిన రెడ్మీ కే 40 గేమ్ ఎన్‌హేన్స్‌డ్ ఎడిషన్‌కు రీ బ్రాండెడ్ వెర్షన్‌గా ఈ ఫోన్ విడుదల కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన టీజర్ వీడియోలో కూడా సంస్థ ఇదే విషయాన్ని పేర్కొంది. అయితే స్పెసిఫికేషన్స్ వివరాలు ముందుగానే లీకయ్యాయి.
కాగా, ఈ ఫోన్ ఐదు వేరియంట్లలో లభించనుంది. విడుదలకు సిద్దంగా ఉన్న పోకో ఎఫ్3 జిటి (POCO F3gt)మోడల్ కూడా రెడ్మీ కే 40 ధరతో సమానంగా లభించే అవకాశం ఉంది. చైనా మార్కెట్లో రెడ్మీ కే40 ధర.. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర సుమారు రూ. 23,000కు లభిస్తుంది. పోకో ఎఫ్ 3 జిటి ఇండియా ధర రూ.25 వేల నుంచి రూ .30,000 మధ్య ఉండే అవకాశం ఉంది.
పోకో ఎఫ్ 3జీటీ (POCO F3 GT) స్మార్ట్‌ఫోన్‌లో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+AMOLED డిస్‌ప్లేను అందించనున్నారు. ఇది ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 SoC ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. దీనిలో12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వరకు అందించింది. ఇక దీనిలో 67W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5,065 mAh బ్యాటరీని అందించింది.
కెమెరా విషయానికి వస్తే.. దీని వెనుకవైపు, ట్రిపుల్ కెమెరా సెటప్‌ను చేర్చింది. ఇది 64MP ప్రైమరీ లెన్స్ కెమెరా, 8MP అల్ట్రావైడ్ సెన్సార్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 2 ఎంపి మైక్రో కెమెరాను కూడా ప్యాక్ చేస్తుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరాను చేర్చింది. 5జీ, వైఫై, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్‌సీ పోర్ట్‌లను అందించింది. ఇది ఆండ్రాయిడ్ 11 బేస్డ్ MIUI 12.5తో రన్ అవుతుంది.