PM Modi: దేశంలో తొలి ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ..

|

Jul 30, 2022 | 11:36 AM

PM Modi: మన దేశంలో తొలి ఇంటర్నేషనల్‌ బులియన్ ఎక్స్ఛేంజ్‌ను ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ. గుజరాత్‌ రాజధాని గాంధీనగర్‌..

PM Modi: దేశంలో తొలి ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ..
Pm Modi
Follow us on

PM Modi: మన దేశంలో తొలి ఇంటర్నేషనల్‌ బులియన్ ఎక్స్ఛేంజ్‌ను ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ. గుజరాత్‌ రాజధాని గాంధీనగర్‌ దగ్గర్లోని గిఫ్ట్ సిటీలో ఇంకొన్ని ప్రాజెక్ట్‌లకు కూడా శ్రీకారం చుట్టారాయన. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని.. ప్రపంచ ఆర్థిక రంగాన్ని ప్రభావితం చేసే అమెరికా, బ్రిటన్‌, సింగపూర్‌ వంటి దేశాల సరసన ఇప్పుడు భారత్‌ కూడా నిలుస్తుందన్నారు.

గిఫ్ట్‌ సిటీగా పిలిచే గుజరాత్‌ ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ టెక్‌-సిటీలో ఇంటర్నేషనల్‌ బులియన్ ఎక్స్ఛేంజ్‌ను ప్రారంభించారు మోదీ. దీంతో పాటు ఇండియాలో మొదటిసారిగా ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ సర్వీస్‌ సెంటర్‌లో NSE-SGX Connectను కూడా ప్రారంభించారు. ఇది సింగపూర్‌ ఎక్స్చేంజ్‌ లిమిటెడ్‌ సహకారంతో పనిచేస్తుంది. గిఫ్ట్‌ సిటీలో ప్రారంభించిన ఇంటర్నేషనల్‌ బులియన్ ఎక్స్ఛేంజ్‌ ప్రపంచంలో మూడోది అవుతుంది. ఈ ఎక్స్చేంజ్‌తో ఇండియాలో బులియన్‌ మార్కెట్‌ పటిష్టమవుతుందని భావిస్తున్నారు. అంతేకాదు ప్రపంచ బులియన్‌ మార్కెట్‌ను ఇండియా ప్రభావితం చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఫైనాన్స్‌, టెక్నాలజీ లింక్‌ అయి ఉన్నాయన్నారు. ప్రపంచంలో రియల్‌ టైమ్‌ డిజిటల్‌ పేమెంట్స్‌లో 40 శాతం వాటా ఇండియాదేనన్నారు మోదీ.

ఇక ప్రధాని మోదీతో పాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా గిఫ్ట్‌ సిటీలో ప్రారంభోత్సవ కార్యక్రమాలకు హాజరయ్యారు. గిఫ్ట్‌ సిటీలో 27 అంతస్తులు, మూడు లక్షల చదరపు అడుగుల ఏరియాతో నిర్మించే ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ సర్వీస్‌ సెంటర్‌ అథారిటీ హెడ్‌ క్వార్టర్స్‌కు కూడా శంకుస్థాపన చేశారు మోదీ.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..