PM Kisan Yojana: కేంద్రప్రభుత్వం దేశంలోని రైతుల కోసం అనేక రకాల పథకాలను తీసుకువచ్చింది.. అందులో రైతులకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు ప్రవేశపెట్టిన స్కీమ్ ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకం. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ప్రతి సంవత్సరం దాదాపు 6 వేల రూపాయాలను అందచేయనున్నారు. అయితే ఈ డబ్బులన్నీ ఒకేసారి కాకుండా.. విడతల వారిగా నేరుగా అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. ఒక్కో విడతల రూ. 2 వేల రూపాయాలను జమ చేయనున్నారు. ఇప్పటివరకు పది విడతల నగదును రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. దేశంలో సొంతంగా భూమి కలిగినవారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఇప్పటివరకు ఈ స్కీమ్ కింద దాదాపు 4,350 కోట్ల రూపాయాలకు పైగా బదిలీ చేయబడిందని కేంద్రం గుర్తించింది. పీఎం కిసాన్ పథకం కింద ఆదాయపు పన్ను చెల్లించి ప్రయోజనాలు పొందే అర్హత లేని వారి నుంచి రీయంబర్స్మెంట్ అంటే వారు పొందిన నగదును వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. తాజాగా ఈ పథకానికి అర్హులైన కుటుంబాలను గుర్తించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిగి ఉంటాయి. ఈ క్రమంలోనే పీఎం కిసాన్ పథకానికి అర్హులు కానీ వారి జాబితాను విడుదల చేసింది.
ఈ పథకాన్ని కుటుంబంలోని భర్త, భార్య, వారి మైనర్ పిల్లలకు వర్తిస్తుంది. అయితే ఈ పథకానికి ఉన్నత ఆర్థిక స్థితికి చెందినవారు అనర్హులు అని కేంద్రం తెలిపింది. అలాగే మరికొందరు కూడా ఈ పథకానికి అనర్హులు. వారెవరంటే..
* సంస్థాగత భూమి కలవారు ఈ పథకానికి అనర్హులు.
* మాజీ, ప్రస్తుతం రాజ్యంగ పదవులు కలిగి ఉన్న రైతు కుటుంబాలు.
* మాజీ, ప్రస్తుత మంత్రులు, పార్లమెంట్, శాసనసభ్యులుగా ఉన్న కుటుంబాలు.
* రాష్ట్ర శాసన మండలి సభ్యుల కుటుంబాలు, మునిసిపల్ కార్పొరేషన్ మాజీ, ప్రస్తుత మేయర్ , జిల్లా పంచాయితీల మాజీ,ప్రస్తుత అధ్యక్షుల కుటుంబాలు.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలలో ప్రస్తుతం పనిచేస్తున్నవారు… పదవి విరమణ పొందిన అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలు.
* కేంద్ర లేదా రాష్ట్ర PSEలు, అనుబంధిత కార్యాలయాలు లేదా కేంద్రం పరిధిలోని స్వయంప్రతిపత్త సంస్థలలో ప్రస్తుత లేదా మాజీ అధికారులు. (స్థానిక సంస్థల రెగ్యులర్ ఉద్యోగులు, మల్టీ టాస్కింగ్ సిబ్బంది, క్లాస్ IV, గ్రూప్ డీ ఉద్యోగులు మినహా).
* నెలవారీ పెన్షన్ రూ. 10,000 లేదా అంతకంటే ఎక్కువ తీసుకునేవారు అనర్హులు.
* గత అసెస్‌మెంట్ సంవత్సరాల్లో ఆదాయపు పన్ను చెల్లించిన వారు.
* ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్ట్‌లు వంటి ఉద్యోగులకు కూడా పీఎం కిసాన్ డబ్బులు రావు.
అయితే ఇప్పటివరకు పీఎం కిసాడ్ డబ్బులు పొందిన అర్హత లేనివారు ఇక ఆ నగదును తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయాల్సి ఉంటుంది.. అందుకోసం ముందుగా వీరు పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్‌కు లాగిన్ అయ్యి.. అక్కడ “రిఫండ్ ఆప్షన్ ” పై క్లిక్ చేయాలి. దీంతో వారు ఇప్పటివరకు పొందిన నగదును కేంద్రానికి తిరిగి ఇవ్వచ్చు.
Also Read: NTR: ఫిమేల్ లీడ్స్ పేవరెట్‌గా కొమురం భీముడు.. తారక్ వైపు చూస్తున్న బాలీవుడ్ బ్యూటీస్
K.G.F Chapter 2: రాకీభాయ్ స్టామినా.. అక్కడ భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్న కేజీఎఫ్ చాప్టర్-2..
Acharya: టాప్‌లో ట్రెండ్ అవుతున్న మెగాస్టార్ మూవీ ట్రైలర్.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఆచార్య..
Mirnalini Ravi: మైమరపిస్తున్న ముద్దుగుమ్మ మృణలిని లేటెస్ట్ ఫొటోస్..