PM Kisan: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. ఆగస్టు 31 వరకు గడువు పెంపు.. ఇదే చివరి అవకాశమన్న కేంద్రం

|

Aug 19, 2022 | 4:24 PM

PM Kisan: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోంది. రైతులు ఆర్థికంగా సాయం అందించేందుకు పథకాలను రూపొందిస్తోంది..

PM Kisan: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. ఆగస్టు 31 వరకు గడువు పెంపు.. ఇదే చివరి అవకాశమన్న కేంద్రం
Pm Kisan Samman Nidhi Yojana
Follow us on

PM Kisan: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోంది. రైతులు ఆర్థికంగా సాయం అందించేందుకు పథకాలను రూపొందిస్తోంది మోడీ సర్కార్‌. ఇక కేంద్ర ప్రవేశపెడుతున్న పథకాలలో ప్రధాన్‌ మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ యోజన స్కీమ్‌ ఒకటి. ఈ పథకం ద్వారా దేశంలోని రైతులు ఏడాదికి రూ.6,000 చొప్పున సాయం అందుకోవచ్చు. ఈ పథకం కింద ఏడాదిలో మూడు విడతల్లో ఈ డబ్బులను రైతుల అకౌంట్లో జమ చేస్తోంది. సంవత్సరంలో మూడు దఫాల్లో రూ.2,000 చొప్పున రైతులు అందుకుంటున్నారు. ఇప్పటి వరకు రైతులు 11వ విడత డబ్బులు అందుకోగా, ఇప్పుడు 12వ విడత అందుకోనున్నారు. ఈ విడత డబ్బులు సెప్టెంబర్‌లో రైతుల ఖాతాల్లో జమ కానున్నట్లు కేంద్ర వర్గాల ద్వారా సమాచారం. ఇక ఈ పథకంలో ముఖ్య విషయం ఏంటంటే.. కేవైసీ. ఈ పథకం కింద సాయం పొందుతున్న ప్రతి రైతు కూడా కేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ మీరు ఈ స్కీమ్‌ ద్వారా డబ్బులు పొంది ఈకేవైసీ పూర్తి చేసుకోనట్లయితే 12వ విడత మీ ఖాతాలో జమ కావు. అందుకే వ్యవసాయంలో పెట్టుబడి సాయంగా ఈ డబ్బులు అందుకోవాలంటే ఈకేవైసీ (EKYC) చేసుకోవడం తప్పనిసరి.

ఈకేవైసీ గడువు పెంపు..
ఇప్పటి వరకు ఈకేవైసీ గడువు జులై 31తో ముసిగిన విషయం తెలిసిందే. ఇంకా కొంత మంది రైతులు ఈ ప్రక్రియను పూర్తి చేయలేరు. దీంతో మోడా ప్రభుత్వం రైతులకు మరోమారు అవకాశం కల్పించింది. ఈనెల 31 వరకు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరులోగా రైతులు ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే డబ్బులు మీ ఖాతాలో జమ కావని గుర్తించుకోవాలి. వెంటనే ఆన్‌లైన్‌ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని రైతులకు సూచించింది కేంద్రం. మీరు ఇంట్లో ఉండి కూడా ఆన్‌లైన్‌ ద్వారా ఈ పని పూర్తి చేసుకోవచ్చు.

ఈ కేవైసీ ఎలా చేసుకోవాలి..?
☛ ముందుగా పీఎం కిసాన్‌ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

ఇవి కూడా చదవండి

☛ ఆ వెబ్‌సైట్‌లో కుడివైపు కనిపించే ఈ-కేవైసీపై క్లిక్‌ చేయాలి.

☛ అందులో ఆధార్‌ నెంబర్‌, కనిపించే కోడ్‌ను నమోదు చేయాలి.

☛ ఆధార్‌తో లింకైన మొబైల్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేయాలి.

☛ పూర్తి వివరాలు నమోదు చేసిన తర్వాత మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీ (OTP)ని ఎంటర్‌ చేయాలి.

☛ అన్ని వివరాలు సరిగ్గా ఉంటే మీ ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది.

ఇక మీ దగ్గరలో ఉన్న ఈ-సేవ కేంద్రాలకు కూడా వెళ్లి ఈ పనిని పూర్తి చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇదే చివరి అవకాశమని, మరోసారి గడువు పెంచే ఆలోచన లేదని కేంద్రం స్పష్టం చేసింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి