ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 15వ విడత కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, తదుపరి భాగం నవంబర్ చివరి వారంలో విడుదల కానుంది. గతంలో 14వ భాగం ఈ ఏడాది జూలైలో విడుదలైంది. అయితే ఈ పీఎం కిసాన్ సమ్మాన్‌నిధి యోజన స్కీమ్ కింద రైతులకు ఏడాదికి 6 వేల రూపాయలను అందించనుంది. అయితే ఈ డబ్బులు ఒకే విడతలో కాకుండా మూడు విడతల్లో 2 వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.
డీబీటీ అగ్రికల్చర్ వెబ్‌సైట్ ప్రకారం.. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 15వ విడత కోసం, లబ్ధిదారులు eKYC పొందడం తప్పనిసరి, లేకుంటే వారు పథకం ప్రయోజనాలను కోల్పోతారు. లబ్ధిదారులు తమ ఆధార్‌తో అనుసంధానించబడిన మొబైల్ నంబర్‌కు వచ్చిన OTP ద్వారా పీఎం కిసాన్ పోర్టల్ నుండి eKYC చేయవచ్చు. మీరు Google Play Store నుండి PMKISAN GOI యాప్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా, మీ ఆధార్ మొబైల్ నంబర్‌ను ఫేస్ అథెంటికేటర్ ద్వారా లింక్ చేయడం ద్వారా eKYCని మీరే ధృవీకరించుకోవచ్చు. eKYCకి చివరి తేదీ 31 అక్టోబర్ 2023 వరకు అవకాశం ఉంది.
పీఎం కిసాన్ వెబ్‌సైట్ ప్రకారం.. పీఎం కిసాన్ నమోదు చేసుకున్న రైతులకు eKYC తప్పనిసరి. OTP ఆధారిత eKYC PMKisan పోర్టల్‌లో అందుబాటులో ఉంది లేదా బయోమెట్రిక్ ఆధారిత eKYC కోసం సమీపంలోని సీఎస్‌సీ కేంద్రాలను సంప్రదించవచ్చు. ప్రభుత్వం జూన్‌లో ఫేస్ అథెంటికేషన్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. అందువల్ల, రైతులు ఇప్పుడు వారి వేలిముద్ర లేదా ఓటీపీ బదులుగా వారి ఫేస్ స్కాన్ చేయడం ద్వారా ఈ యాప్‌ని ఉపయోగించి ఇంటి నుండి సులభంగా ఈకేవైసీ పూర్తి చేయవచ్చు.