Update: మోడీ సర్కార్ రైతుల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. ఆర్థికంగా ఎదిగేందుకు వివిధ రకాల పథకాలను రూపొందిస్తూ ఆసరాగా నిలుస్తున్నారు. ఇప్పటికే పీఎం కిసాన్ పథకంలో లబ్ది పొందుతున్న రైతులకు మరో పథకాన్ని అమలు చేస్తోంది కేంద్రం. పీఎం కిసాన్ ఎఫ్‌పీవో (PM Kisan FPO) పథకం కింద 11 మంది రైతులకు కలిపి ఏకంగా రూ.15 లక్షలు అందనున్నాయని వార్త సర్కులేట్ అయ్యింది. రైతులకు రూ.15 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం నిజమే కానీ… 11 మందికి మాత్రమే కాదు. ఈ పీఎం కిసాన్ ఎఫ్‌పీవో స్కీమ్ కింద 15-20 మంది కలిగి ఉన్న 20 లేదా అంతకంటే ఎక్కువ గ్రూప్‌లను కలిపి ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్‌గా (FPO) పరిగణిస్తారు. అయితే ఒక ఎఫ్‌పీవోలో కనీసం 300 మంది ఉండాలి. ఇలా ఏర్పడిన ఒక్కో FPOకు ప్రభుత్వం గరిష్టంగా రూ.15 లక్షలు మ్యాచింగ్ గ్రాంట్ ఈక్విటీ అందజేస్తుంది. అంటే ఒక ఎఫ్‌పీవో గరిష్టంగా 15 లక్షల ఈక్విటీ పొందాలంటే ఆ ఎఫ్‌పీవోలో సుమారు 750 మంది రైతులు ఉండాల్సి ఉంటుందని గుర్తించుకోండి. ఫ్యాక్ట్ చెక్ సంస్థ FACTLY పూర్తి శోధన అనంతరం ఈ మేరకు క్లారిటీ ఇచ్చింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పథకం ముఖ్య ఉద్దేశం రైతుల ఆదాయన్ని రెట్టింపు చేయడమే. ఈ పథకం కింద బ్యాంకుల నుంచి తక్కువ ధరలకు రుణాలను పొందగలుగుతారు. రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు మోడీ ప్రభుత్వం ‘పీఎం కిసాన్ ఎఫ్‌పీఓ యోజన’ పథకాన్ని ప్రారంభించింది. కొత్త వ్యవసాయ వ్యాపారాన్ని ప్రారంభించడానికి దేశవ్యాప్తంగా రైతులకు ఆర్థిక సహాయం అందించనుంది.
రైతులు స్థాపించిన సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ లేదా చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ లేదా మేనేజర్ రిజిస్ట్రేషన్ సమయంలో పేరు, అడ్రస్, ఇమెయిల్ ఐడీ ఇవ్వాల్సి ఉంటుంది. రైతుల ఆధార్ కార్డ్ , అడ్రస్ ప్రూప్, వ్యవసాయ భూములకు సంబంధించిన పత్రాలు, రేషన్ కార్డ్, ఐ సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, బ్యాంక్ స్టేట్మెంట్ వంటివి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే దరఖాస్తులు పరిశీలించిన తర్వాత వారికి నిధులు మంజూరవుతాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి