
పీఎం కిసాన్ పధకం కింద ప్రతీ ఆర్ధిక సంవత్సరంలో రూ.6 వేల చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం జమ చేస్తోంది. వీటిన మూడు విడతలుగా అందిస్తోంది. జూన్‌లో ఈ ఏడాదికి సంబంధించి తొలి విడత కింద రూ.2 వేల చొప్పున లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లలోకి విడుదల చేసింది. ఇది 23వ విడత కాగా.. 24వ విడత సొమ్ము ఎప్పుడు అందుతుందనే విషయం రైతులు చర్చించుకుంటున్నారు. కేంద్రం త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉందంటూ ప్రచారం సాగుతోంది. అక్టోబర్‌లో కేంద్రం రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాఖీ పండుగ సందర్భంగా ఆగస్టు 28న రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ పథకం కింద కేంద్రం ఒకేసారి రూ.4 వేల జమ చేయనుందనే ఓ వార్త వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న వార్తపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన PIB Fact Check స్పందించింది. వైరల్ అవుతున్న వార్తలో వాస్తవం లేదని స్పష్టం చేసింది.ఆగస్టు 28న రూ.4 వేలు విడుదలపై కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదని తెలిపింది. రైతులు ఇలాంటి వైరల్ వీడియోలు, ఫేక్ మెసేజ్‌లను నమ్మవద్దని, అధికారిక సమాచారం కోసం పీఎం కిసాన్, PIB Fact Check ఫ్లాట్‌ఫామ్స్‌ను మాత్రమే నమ్మాలని సూచించింది. ఇతర ఫ్లాట్ ఫామ్స్‌లో వచ్చే వార్తలను నిర్దారించుకోవాలని తెలిపింది. జూన్ 20న 23వ విడత నిధులు విడుదల అయ్యాయి.
“రక్షాబంధన్ సందర్భంగా దేశంలోని రైతులకు పీఎం కిసాన్ పథకం కింద 24వ విడతగా రూ.4 వేలు ఇవ్వనున్నట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. PIBFactCheck ఈ ప్రచారం నకిలీదని, ఈ వీడియోను ఏఐ ఉపయోగించి సృష్టించారని ధృవీకరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అటువంటి ప్రకటన ఏదీ చేయలేదు. పీఎం-కిసాన్ పథకం 23వ విడతను 20 జూన్ 2026న మోదీ విడుదల చేశారు. 24వ విడతకు సంబంధించి భారత ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అధికారిక సమాచారం కోసం https://pmkisan.gov.in వెబ్ సైట్ చూడండి. దయచేసి తప్పుడు వార్తల పట్ల అప్రమత్తంగా ఉండండి. అటువంటి తప్పుదోవ పట్టించే, సంచలనాత్మక కంటెంట్‌ను నమ్మి మోసపోకండి. అలాగే వాటిని ఫార్వార్డ్ చేయకుండా ఉండండి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా అనుమానాస్పద వీడియో లేదా సమాచారంపై 91 8799711259 వాట్సప్ నెంబర్ లేదా factcheck@pib.gov.in మెయిల్ ఐడీ ద్వారా ఫిర్యాదు చేయండి.
दावा: सोशल मीडिया पर एक वीडियो में दावा किया जा रहा है कि रक्षाबंधन के अवसर पर देश के किसानों को #PMKISAN योजना के तहत 24वीं किस्त के रूप में ₹4,000 की राशि दी जाएगी।#PIBFactCheck
❌ यह दावा फर्जी है और यह वीडियो AI से बनाया गया है।
✅ केंद्र सरकार द्वारा ऐसी कोई घोषणा नहीं… pic.twitter.com/1Py9MRMTNC
— PIB Fact Check (@PIBFactCheck) August 20, 2026