
కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ లబ్దిదారులకు శుభవార్త అందించింది. 22వ విడత నిధులను కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. అస్సోంలోని గువహతిలో జరిగిన కార్యక్రమంలో మోదీ బటన్ నొక్కి నిధులను రిలీజ్ చేశారు. దీంతో ఒక్కొక్క లబ్దిదారుడి అకౌంట్లో రూ.2 వేల జమ అయ్యాయి. ఇవాళ రైతుల బ్యాంక్ అకౌంట్లలో ఈ నిధులు జమ కానున్నాయి. దేశవ్యాప్తంగా 93.2 మిలియన్లకుపైగా రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో రూ.18,640 కోట్లకుపైగా బదిలీ చేశారు. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా రైతులకు రూ.4.27 లక్షల కోట్లను ప్రభుత్వం అందించింది.
పీఎం కిసాన్ లబ్దిదారులు నగుదును అందుకోవాలంటే తప్పనిసరగా ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలి. ఇక బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి. ప్రభుత్వ పత్రాలతో భూమి రికార్డులను నమోదు చేసి ఉండాలి. బ్యాంక్ అకౌంట్ యాక్టివ్‌గా ఉండి ఉండాలి. ల్యాండ్ రికార్డుల సమస్యలు ఉండకూడదు. ఓటీపీ, నోటిఫికేషన్ల కోసం మొబైల్ నెంబర్‌ను అప్డేట్ చేసుకుని ఉండాలి. దీంతో మీ బ్యాంక్ అకౌంట్లో పీఎం కిసాన్ నిధులు పడగానే మీ మొబైల్‌కు మెస్సేజ్ వస్తుంది. దీని వల్ల మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయో.. లేదో తెలిసిపోతుంది.
-మీకు పీఎం కిసాన్ డబ్బులు వచ్చాయో.. లేదో స్టేటస్ చేసుకోవచ్చు
-ఇందుకోసం పీఎం కిసాన్ వెబ్ సైట్ https://pmkisan.gov.in/లోకి వెళ్లండి
-హోమ్ పేజీలో Know Your Status ఆప్షన్‌పై క్లిక్ చేయండి
-పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి
-మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయండి
-ఆ తర్వాత ఇనాస్టాల్‌మెంట్ డీటైల్స్‌లో 22వ విడత సెలక్ట్ చేసుకోండి
-అక్కడ మీ బ్యాంక్ అకౌంట్ డీటైల్స్‌తో పాటు మీకు డబ్బులు పడ్డాయో.. లేదో స్టేటస్ తెలుస్తుంది
పీఎం కిసాన్ పోర్టల్ లేదా మొబైల్ యాప్‌లోకి వెళ్లి బెనిఫిషియరీ లిస్ట్‌లో మీ పేరు ఉందో.. లేదో తెలుసుకోండి. మీ పేరు ఉంటేనే అకౌంట్లలో నిధులు జమ అవుతాయి. ఇటీవల కొంతమంది అనర్హుల పేర్లను కేంద్రం తొలగించింది. దీంతో బెనిఫిషియరీ లిస్ట్ చేెక్ చేసుకోండి. అందులో మీ పేరు ఉండి కేవైసీ పూర్తి చేసి ఉంటే అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయి.