PM Kisan: మీకు పీఎం కిసాన్‌ 20వ విడత అందలేదా? నో టెన్షన్‌.. ఇలా చేయండి!

PM Kisan: 20వ విడతను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2025 ఆగస్టు 2న వారణాసి నుండి విడుదల చేశారు. కానీ ఈ మొత్తం ఇంకా వేలాది మంది రైతుల ఖాతాలకు చేరలేదు. మీరు కూడా వారిలో ఒకరైతే, భయపడాల్సిన అవసరం లేదు..

PM Kisan: మీకు పీఎం కిసాన్‌ 20వ విడత అందలేదా? నో టెన్షన్‌.. ఇలా చేయండి!

Updated on: Aug 18, 2025 | 9:25 AM

PM Kisan: ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత మీ ఖాతాకు రాకపోతే టెన్షన్‌ పడాల్సిన అవసరం లేదు. మీకు పీఎం కిసాన్‌ రాకుంటే రకరకాల కారణాలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం అసంపూర్ణమైన e-KYC, ఆధార్-బ్యాంక్ లింక్ లేకపోవడం, అసంపూర్ణమైన భూమి ధృవీకరణ లేదా బ్యాంక్ వివరాలలో తప్పులు కావచ్చు. మీరు పీఎం కిసాన్‌ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఇంటి నుండే e-KYC చేయవచ్చు లేదా సమీపంలోని CSC కేంద్రంలో బయోమెట్రిక్స్‌తో ప్రక్రియను పూర్తి చేయవచ్చు. సమస్య కొనసాగితే Kisan హెల్ప్‌లైన్ 1800-180-1551ని సంప్రదించి మీ నిలిచిపోయిన వాయిదాను తిరిగి పొందవచ్చు.

ఇది కూడా చదవండి: ఖరీదైన కారు నంబర్‌ ప్లేట్‌.. దీని ధర ఎంతో తెలిస్తే మైండ్‌ బ్లాంకే

20వ విడతను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2025 ఆగస్టు 2న వారణాసి నుండి విడుదల చేశారు. కానీ ఈ మొత్తం ఇంకా వేలాది మంది రైతుల ఖాతాలకు చేరలేదు. మీరు కూడా వారిలో ఒకరైతే, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని సులభమైన చర్యలు తీసుకోవడం ద్వారా మీరు నిలిచిపోయిన వాయిదాను తిరిగి పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Gold Price Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతో తెలుసా?

వాయిదా ఎందుకు నిలిచిపోతోంది?

చాలా మంది రైతుల ఖాతాలోకి వాయిదాలు రాకపోవడం వెనుక వివిధ కారణాలు ఉండవచ్చు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఇది తెలుసుకోవడం ముఖ్యం.

  • e-KYC పూర్తి కాకపోవడం
  • ఆధార్ కార్డు బ్యాంకు ఖాతాకు లింక్ లేకపోవడం
  • భూమి ధృవీకరణ అసంపూర్ణంగా ఉండటం
  • బ్యాంక్ వివరాలు లేదా పేరులో తప్పు ఉండటం
  • ఒకే కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది సభ్యులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటే కూడా వాయిదా నిలిచిపోవచ్చు.

e-KYC ఎందుకు చేయించుకోవాలి?

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాలను పొందడానికి E-KYC అత్యంత ముఖ్యమైన ప్రక్రియ. e-KYC లేకుండా మీకు డబ్బులు రావు. మీ మొబైల్ నంబర్ ఆధార్‌తో అనుసంధానించబడి ఉంటే మీరు ఇంట్లో కూర్చుని కూడా దీన్ని పూర్తి చేయవచ్చు.

ఇంటి నుండే e-KYC :

  • PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in ని సందర్శించండి.
  • హోమ్‌పేజీలో కుడి వైపున ఉన్న e-KYC ఎంపికపై క్లిక్ చేయండి.
  • మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, సెర్చ్‌పై క్లిక్ చేయండి.
  • ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేయండి.
  • ‘e-KYC విజయవంతంగా సమర్పించబడింది’ అనే సందేశం స్క్రీన్‌పై కనిపించిన తర్వాత ప్రక్రియ పూర్తవుతుంది.

మొబైల్ నంబర్ ఆధార్ తో లింక్ కాలేదా?

మీ మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ చేయకపోతే మీరు సమీపంలోని సీఎస్‌సీ (కామన్ సర్వీస్ సెంటర్)కి వెళ్లాలి. మీ e-KYC బయోమెట్రిక్స్ ద్వారా అక్కడ పూర్తి చేసుకోవచ్చు.

సమస్య కొనసాగితే ఎక్కడ సంప్రదించాలి:

e-KYC, అన్ని ఇతర దిద్దుబాట్ల తర్వాత కూడా వాయిదా మీ ఖాతాలోకి రాకపోతే మీరు నేరుగా కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్ 1800-180-1551 కు కాల్ చేయవచ్చు. ఇక్కడ నుండి మీరు సమస్యను పరిష్కరించుకోవచ్చు. అలాగే మీరు సరైన సమయంలో మీ సమస్యను పరిష్కరించుకుంటే నిలిచిపోయిన వాదాయి వస్తుంది. లేకుంటే రాకపోవచ్చు.

ఇది కూడా చదవండి: తెలంగాణలో రెండు విమానాశ్రయాలు.. ఆ ప్రాంతాల్లోనే ఏర్పాటు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి