పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 14వ విడతను మోదీ ప్రభుత్వం విడుదల చేసింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రభుత్వం రైతులకు ఎన్నో ప్రయోజనాలు అందిస్తోంది. ఈ పథకం ద్వారా మోదీ ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకు మేలు చేస్తోంది. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది భూమిని కలిగి ఉన్న రైతులకు, వారి కుటుంబాలకు సంవత్సరానికి రూ. 6,000 వరకు ఆర్థిక సహాయం అందించే కేంద్రం ఇచ్చే సాయం. ఈ కార్యక్రమం 2019 సంవత్సరంలో ప్రకటించబడింది. ఈ పథకం కింద, లక్ష్యం చేసుకున్న లబ్ధిదారులకు కేంద్రం ఆర్థిక సహాయం అందిస్తుంది.
డబ్బులు పడ్డాయో.. లేదో.. ఇలా చెక్ చేసుకోవాలి.. ఎవరిని అడగాలి.. ఇంటర్నెట్ సెంటర్‌కు కానీ, ప్రభుత్వ కార్యాలయంకు వెళ్లాలా.. ఏం చేయాలి.. ఇలాంటి ప్రశ్నలు మనలో చాలా మందికి వచ్చి ఉంటాయి. అలాంటి సమయంలో ఎవరిని అడగాల్సిన పనిలేదు. మీరు ఇంట్లో కూర్చుని పీఎం కిసాన్ పథకం డబ్బులు మీ ఖాతాలో పడ్డాయో లేదో తెలుసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం..
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద.. కేంద్ర ప్రభుత్వం ఆధార్, ఎన్‌పిసిఐకి అనుసంధానించబడిన బ్యాంకు ఖాతాలలో 14వ వాయిదాను చెల్లించింది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (ఐపీపీబీ)లో కొత్త (డీపీటీ ఎనేబుల్డ్) ఖాతాను ఓపెన్ చేయవచ్చు. ఇది కాకుండా, మీ బ్యాంక్ ఖాతా స్టేట్‌మెంట్‌ను కూడా చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇంట్లో కూర్చొని కూడా పీఎం కిసాన్ డబ్బులు పడ్డాయో లేదో సూసుకోవచ్చు.
14వ చెల్లింపు ప్రయోజనం అందించబడింది. లబ్ధిదారుడు అతని/ఆమె రిజిస్టర్డ్ ఆధార్ మొబైల్ నంబర్‌కు పంపిన ఓటీపీని ఉపయోగించి ఎవరి సాయం లేకుండానే స్వయంగా eKYCని ధృవీకరించవచ్చు. పీఎం కిసాన్ పోర్టల్‌లో కూడా పేర్కొనబడింది. అదే సమయంలో, లబ్ధిదారుల వివరాలను తనిఖీ చేయడానికి.. మీరు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు . మీ ఆధార్ మొబైల్ నంబర్‌తో లాగిన్ చేయవచ్చు.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం