Home Loans: గృహ రుణంపై అదిరే ఆఫర్లు.. తక్కువ వడ్డీ.. ప్రాసెసింగ్ ఫీజులపై రాయితీలు.. త్వరపడండి..

| Edited By: Ravi Kiran

Nov 21, 2023 | 9:00 PM

ఏదైనా బ్యాంకులో గృహ రుణం తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారా? అయితే మీకు ఇదే బెస్ట్ సమయం. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లోనూ పండుగ ఆఫర్లున ప్రకటించాయి. వడ్డీ రేట్లలో తగ్గింపులు, పలు రాయితీలు అందిస్తున్నాయి. పలు బ్యాంకుల్లో వడ్డీ రేటు 8.35 కన్నా తక్కువకే అందిస్తున్నాయి. అలాగే మరికొన్ని బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజుపై 50శాతం రాయితీని ఇస్తున్నాయి.

Home Loans: గృహ రుణంపై అదిరే ఆఫర్లు.. తక్కువ వడ్డీ.. ప్రాసెసింగ్ ఫీజులపై రాయితీలు.. త్వరపడండి..
Home Loan
Follow us on

మీరు ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? లేక మీకు ఉన్న స్థలంలో కొత్త ఇల్లు కట్టుకోవాలని భావిస్తున్నారా? అందుకోసం ఏదైనా బ్యాంకులో గృహ రుణం తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారా? అయితే మీకు ఇదే బెస్ట్ సమయం. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లోనూ హోమ్ లోన్లపై పండుగ ఆఫర్లు ప్రకటించాయి. వడ్డీ రేట్లలో తగ్గింపులు, పలు రాయితీలు అందిస్తున్నాయి. పలు బ్యాంకుల్లో వడ్డీ రేటు 8.35 కన్నా తక్కువకే అందిస్తున్నాయి. అలాగే మరికొన్ని బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజుపై 50శాతం రాయితీని ఇస్తున్నాయి. జాతీయ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.40 శాతం నుంచి వడ్డీ అందిస్తుండగా.. ప్రైవేటు బ్యాంకుల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్లలో 8.35 శాతం నుంచి వడ్డీ ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో టాప్ 5 బ్యాంకుల్లో వడ్డీరేట్లు, ఆఫర్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు..

  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ. 30 లక్షల వరకూ ఇచ్చే లోన్లపై 8.40 నుంచి10.15శాతం, రూ.30లక్షల నుంచి రూ.75లక్షల వరకూ 8.40 నుంచి 10.05శాతం, రూ. 75 లక్షలకు పైనే రుణంపై 8.40 నుంచి 10.05శాతం వడ్డీని వసూలు చేస్తుంది.
  • బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ. 30 లక్షల వరకూ ఇచ్చే లోన్లపై 8.40 నుంచి 10.65శాతం, రూ.30లక్షల నుంచి రూ.75లక్షల వరకూ 8.40 నుంచి 10.65శాతం, రూ. 75 లక్షలకు పైనే రుణంపై 8.40 నుంచి 10.90 శాతం వరకూ వడ్డీ ఉంటుంది.
  • యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ. 30 లక్షల వరకూ ఇచ్చే లోన్లపై 8.40 నుంచి 10.80శాతం, రూ.30లక్షల నుంచి రూ.75లక్షల వరకూ 8.40 నుంచి 10.95శాతం, రూ. 75 లక్షలకు పైనే రుణంపై 8.40 నుంచి 10.95శాతం వరకూ వడ్డీ వసూలు చేస్తుంది.
  • పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో రూ. 30 లక్షల వరకూ ఇచ్చే లోన్లపై 8.45 నుంచి 10.25శాతం, రూ.30లక్షల నుంచి రూ.75లక్షల వరకూ 8.40 నుంచి10.15శాతం, రూ. 75 లక్షలకు పైనే రుణంపై 8.40 నుంచి 10.15శాతం వడ్డీ రేటు అందిస్తుంది.
  • బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ. 30 లక్షల వరకూ ఇచ్చే లోన్లపై 8.30 నుంచి 10.75శాతం, రూ.30లక్షల నుంచి రూ.75లక్షల వరకూ 8.30 నుంచి10.75శాతం, రూ. 75 లక్షలకు పైనే రుణంపై 8.30 నుంచి 10.75శాతం వడ్డీ ఉంటుంది.

ఆఫర్లు ఇవి..

  • ఎస్బీఐ పండుగ ప్రచారంలో భాగంగా బ్యాంక్ తన సాధారణ 9.15 శాతం రుణ రేటుతో పోలిస్తే సంవత్సరానికి 8.4 శాతంతో ప్రారంభ హోమ్ లోన్ రేట్లు తగ్గింపును అందిస్తుంది. అలాగే టాప్-అప్ హోమ్ లోన్‌లపై కూడా తగ్గింపు రేట్లు ఉన్నాయి.
  • పంజాబ్ నేషనల్ బ్యాంక్ దీపావళి ధమాకా 2023 పండుగ ఆఫర్ 8.4 శాతం వడ్డీతో గృహ రుణాలను అందిస్తోంది.
    ముందస్తు/ప్రాసెసింగ్ ఫీజులు, డాక్యుమెంటేషన్ ఛార్జీలపై పూర్తి మినహాయింపును అందిస్తోంది. ఈ ఆఫర్‌లు నవంబర్ 30, 2023 వరకు అందుబాటులో ఉంటాయి.
  • బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క ఫెస్టివాంజా ఆఫర్‌లలో హోమ్ లోన్ రేట్లు సంవత్సరానికి 8.4 శాతం నుంచి ప్రారంభమవుతాయి.
  • టేకోవర్‌లు, పూర్తయిన లేదా ప్రభుత్వ ప్రాజెక్టులకు వర్తిస్తోంది. ప్రత్యేక ఆఫర్‌లలో నిల్ ప్రాసెస్ ఫీజులు, రాయితీతో కూడిన ముందస్తు రుసుములు ఉన్నాయి. డిసెంబర్ 31, 2023 వరకు ఆఫర్‌లు అందుబాటులో ఉంటాయి.
  • కెనరా బ్యాంక్‌లు టేకోవర్/రెడీ-టు-మూవ్ హోమ్ లోన్ ప్రతిపాదనల కోసం అదనంగా 5 బీపీఎస్ రాయితీని అందిస్తోంది. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం/పీఎస్యూలు/ఎంఎన్సీలు/బ్లూచిప్ కంపెనీలు, శాలరీ అకౌంట్లపై 5 బీపీఎస్ రాయితీని అందిస్తోంది.
  • కెనరా ఎస్బీ ప్రీమియం పేరోల్ ప్యాకేజీ పేరోల్ ఖాతాలతో సహా కెనరా బ్యాంక్‌తో ఫ్లోర్/సీలింగ్ రేటు వరకు అన్ని లోన్ స్లాబ్‌లలో ఆఫర్ వర్తిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..