Phonepe: ఫోన్ పే వాడేవారికి బిగ్ అలర్ట్.. ఆ ఛార్జీలపై కంపెనీ కీలక ప్రకటన

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి మొబైల్‌లోనూ ఫోన్‌పే యాప్ కచ్చితంగా ఉంటోంది. అయితే గత కొన్ని రోజులుగా ఫోన్‌పే వాలెట్ ఇన్‌యాక్టివిటీ ఛార్జీలకు సంబంధించి వస్తున్న వార్తలు యూజర్లను తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్నాయి. ‘‘వాలెట్ వాడకపోతే మన బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు కట్ చేస్తారా?’’ అనే భయం చాలామందిలో మొదలైంది. ఈ నేపథ్యంలో యూజర్ల అనుమానాలను పటాపంచలు చేస్తూ ఫోన్‌పే కీలక ప్రకటన విడుదల చేసింది.

Phonepe: ఫోన్ పే వాడేవారికి బిగ్ అలర్ట్.. ఆ ఛార్జీలపై కంపెనీ కీలక ప్రకటన
Phonepe Clarifies Wallet Inactivity Fee

Updated on: Jun 20, 2026 | 7:52 PM

యూపీఐ పేమెంట్స్ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చే యాప్స్‌లో ఫోన్‌పే ఒకటి. అయితే ఇటీవల ఫోన్‌పే తన వాలెట్ ఇన్‌యాక్టివిటీపై విధిస్తున్న ఛార్జీల గురించి కొంతమంది కస్టమర్లకు నోటిఫికేషన్లు పంపింది. దాంతో “మా ఫోన్‌పే అకౌంట్ నుండి లేదా లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు కట్ అయిపోతాయా?” అని యూజర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ గందరగోళంపై ఫోన్‌పే స్పందిస్తూ కీలక స్పష్టతనిచ్చింది.

బ్యాంక్ ఖాతాకు, యూపీఐకి సంబంధం లేదు

చాలామంది వినియోగదారులు ఫోన్‌పే అకౌంట్, యూపీఐ అకౌంట్, ఫోన్‌పే వాలెట్.. ఈ మూడింటినీ ఒకటే అనుకుని పొరబడుతుంటారని కంపెనీ తెలిపింది. కానీ ఇవి మూడూ వేర్వేరు సేవలు.

ఫోన్‌పే వాలెట్ : ఇది ఒక ప్రిపేయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్. అంటే ఇందులో మనం ముందుగానే డబ్బులు లోడ్ చేసుకుని వాడుకోవాల్సి ఉంటుంది.

యూపీఐ: యూపీఐ అనేది నేరుగా మీ బ్యాంక్ ఖాతా నుండి డబ్బులను డెబిట్ చేస్తుంది.

కంపెనీ క్లారిటీ: ప్రస్తుతం ప్రకటించిన ఇన్‌యాక్టివిటీ ఛార్జీలు కేవలం ఫోన్‌పే వాలెట్‌కు మాత్రమే వర్తిస్తాయి. దీనివల్ల మీ యూపీఐ లావాదేవీలకు గానీ, బ్యాంక్ ఖాతాకు గానీ ఎలాంటి నష్టం లేదు.

మీ బ్యాంక్ అకౌంట్ నుండి రూపాయి కూడా కట్ అవ్వదు..

ఒకవేళ మీ ఫోన్‌పే వాలెట్‌లో బ్యాలెన్స్ సున్నా ఉండి, మీరు దాన్ని చాలా కాలంగా వాడకపోతే.. మీ బ్యాంక్ అకౌంట్ నుండి లేదా యూపీఐ ద్వారా కంపెనీ ఎలాంటి ఛార్జీలను వసూలు చేయదు. ఈ ఛార్జీల విధింపు అనేది కేవలం వాలెట్‌లో ఉన్న అమౌంట్‌కు మాత్రమే పరిమితం అవుతుంది. మీరు ప్రతిరోజూ యూపీఐ వాడుతున్నా.. వాలెట్ వాడకపోతే మాత్రం వాలెట్ ఇన్‌యాక్టివ్‌గానే పరిగణించబడుతుంది.

ఛార్జీలు కట్ చేసే ముందే 15 రోజుల నోటీస్..

ఏదైనా వాలెట్ నుండి ఇన్‌యాక్టివిటీ ఛార్జీలను మినహాయించే ముందు ఫోన్‌పే సదరు కస్టమర్‌కు 15 రోజుల ముందే సమాచారం పంపుతుంది. ఆ లోపు కస్టమర్ అలర్ట్ అయి క్రింది చర్యలు తీసుకోవచ్చు.

  • వాలెట్‌ను మళ్లీ యాక్టివేట్ చేసుకోవచ్చు.
  • వాలెట్‌లో డబ్బులు యాడ్ చేయవచ్చు.
  • వాలెట్‌లో ఉన్న మిగిలిన బ్యాలెన్స్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చు లేదా వాలెట్‌ను శాశ్వతంగా క్లోజ్ చేయవచ్చు.

కేవైసీ లేకుండానే వాలెట్ రీ యాక్టివేషన్..

ఒకవేళ మీ వాలెట్ ఇన్‌యాక్టివ్ మోడ్‌లోకి వెళ్తే, దాన్ని మళ్లీ యాక్టివేట్ చేయడానికి ఎలాంటి ఫుల్ కేవైసీ అవసరం లేదని కంపెనీ స్పష్టం చేసింది. కేవలం ఓటీపీ వెరిఫికేషన్ పూర్తి చేసి, వాలెట్ ద్వారా ఏదైనా ఒక చిన్న లావాదేవీ జరిపితే అది మళ్లీ యాక్టివేట్ అయిపోతుంది.

క్యాష్‌బ్యాక్ బ్యాలెన్స్ విషయంలో జాగ్రత్త..

మీకు ఫోన్‌పేలో వచ్చే క్యాష్‌బ్యాక్ అంతా వాలెట్‌లో జమ అవుతుందని అనుకుంటే పొరపాటే. ఫోన్‌పేలో వచ్చే చాలా వరకు క్యాష్‌బ్యాక్స్ గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్ రూపంలో స్టోర్ అవుతాయి. కాబట్టి మీకు క్యాష్‌బ్యాక్ వస్తోంది కదా అని మీ వాలెట్ యాక్టివ్‌గా ఉన్నట్టు కాదు. ఆ గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్‌పై ఎలాంటి ఇన్‌యాక్టివిటీ ఛార్జీలు పడవు.

Follow Us