
దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు ఫోన్ ఛార్జింగ్ సమస్య ఉంటుంది. ఫోన్ బ్యాటరీ అయిపోవడం వల్ల చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఛార్జింగ్ పెట్టుకోవడానికి సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల అనక ఇబ్బందులు పడుతుంటారు. జర్నీ చేయడానికి ముందు ఫోన్‌ను ఫుల్ ఛార్జ్ చేస్తారు. కానీ ప్రయాణం సమయంలో సినిమా, సాంగ్స్ వినడం, కాల్స్ మాట్లాడటం లాంటి పనుల వల్ల కొన్ని గంటల్లోనే ఛార్జింగ్ దిగిపోతుంది. కేవలం ఫోడ్ వాడకమే కాకుండా బ్యాక్‌గ్రౌండ్ యాప్‌లు, నెట్‌వర్క్ సెర్చ్‌లు, స్క్రీన్ బ్రైట్‌నెస్ వంటివి ఛార్జింగ్ త్వరగా అయిపోయేలా చేస్తాయి. కొన్ని సులభమైన టెక్ ట్రిక్స్ ద్వారా ఫోన్ ఛార్జింగ్ అయిపోకుండా కాపాడుకోవచ్చు.
ఛార్జింగ్ అయిపోకుండా ఉండాలంటే మీ ఫోన్‌లో సేవర్ మోడ్‌ను ఎనేబుల్ చేసుకోండి. ఆండ్రాయిడ్ ఫోన్లలో బ్యాటరీ సెట్టింగ్స్‌లోకి వెళ్లి యాక్టివేట్ చేసుకోవచ్చు. ఐఫోన్‌లలో, ‘లో పవర్ మోడ్’ అనే ఆప్షన్ ఆన్ చేయడం వల్ల కొన్ని బ్యాక్‌గ్రౌండ్ యాక్టివిటీ, ఆటోమేటిక్ సింకింగ్, విజువల్ ఎఫెక్ట్స్ పరిమితం అవ్వడం వల్ల విద్యుత్ ఆదా అవుతుంది. అలాగే 5G నెట్‌వర్క్‌కి బదులుగా 4G నెట్‌వర్క్‌ను ఉపయోగించండి. మీ మొబైల్ నెట్‌వర్క్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి 4G/LTE నెట్‌వర్క్‌ను ఎంచుకోండి. అలాగే ఫోన్ స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను అవసరమైనంత తక్కువగా ఉంచండి. ఆటో-బ్రైట్‌నెస్‌ను ఉపయోగించడం వల్ల అదే ఆటోమేటిక్‌గా సెట్ చేసుకుంటుంది. అలాగే మీ ఫోన్‌లో 90Hz లేదా 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటే.. 60Hzకు సెట్ చేయండి. స్క్రీన్ టైమ్‌అవుట్‌ను 15 లేదా 30 సెకన్లకు సెట్ చేయండి.
చాలా యాప్‌లు బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేస్తుంటాయి. మీ ఫోన్ సెట్టింగ్స్‌లో వెళ్లి ఏ యాప్‌లు ఎక్కువ బ్యాటరీని వాడుతున్నాయో తెలుసుకుని అవి బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేయకుండా నిలిపివేయండి. అనవరమైన సమయంలో GPS, హాట్‌స్పాట్, బ్లూతూట్ ఆఫ్ చేయండి. సిగ్నల్స్ సరిగ్గా లేని సమయంలో ఏర్‌ప్లేన్ మోడ్‌ను ఆన్ చేయవచ్చు. ఇది బ్యాటరీని ఆదా చేయడంలో సహాయపడుతుంది. ప్రయాణించే ముందు మీ ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేసుకోండి. ముఖ్యమైన టిక్కెట్లు, బోర్డింగ్ పాస్‌లు, ప్రయాణ పత్రాలను ముందుగానే ఆఫ్‌లైన్‌లో సేవ్ చేసుకోండి. దీని ద్వారా ఇంటర్నెట్ లేనప్పుడు కూడా మీరు వాటిని యాక్సెస్ చేయవచ్చు. సుదీర్ఘ ప్రయాణాల కోసం మంచి నాణ్యత గల పవర్ బ్యాంక్‌ను వెంట తీసుకెళ్లడం కూడా మంచిది. ఇటీవల రైళ్లల్లో రాత్రి సమయాల్లో ఫోన్లు, పవర్ బ్యాంక్‌లకు ఛార్జింగ్ పెట్టుకోవడాన్ని రైల్వేశాఖ నిషేధించింది. మీరు ట్రైన్ ప్రయాణం చేస్తుంటే దీని గురించి అవగాహనే ఉండటమే కాకుండా.. దానికి అనుగుణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోండి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రయాణాల సమయంలో మీ ఫోన్ ఛార్జింగ్ ఎక్కువసేపు వస్తుందని నిపుణులు చెబుతున్నారు.