EPFO: పీఎఫ్ చందాదరులకు గుడ్ న్యూస్.. ఇంట్లో నుంచే క్లయిమ్ సెటిల్‌మెంట్.. చాలా సింపుల్..  

క్లయిమ్ ల ప్రక్రియ ఆన్ లైన్ చేయడం, సులభంగా క్లయిమ్ సెటిల్ మెంట్లు చేస్తుండటంతో చందాదారులు పెద్ద ఎత్తున క్లయిమ్లు చేస్తున్నారు. ఈ కొత్త ఆర్థిక సంవత్సరం మొదలయ్యాక అంటే కేవలం రెండు నెలల్లోనే దాదాపు 87 లక్షల క్లయిమ్‌లు సామాజిక భద్రతా ప్రయోజనాల రూపంలో చందాదారులు చేశారు. వీటిల్లో గృహనిర్మాణం, పిల్లల పోస్ట్ మెట్రిక్ విద్య, వివాహం, అనారోగ్యం, ఫైనల్ ప్రావిడెంట్ ఫండ్ సెటిల్‌మెంట్, పెన్షన్, బీమా మొదలైన వాటి రూపంలో క్లయిమ్ లు పరిష్కారమయ్యాయి.

EPFO: పీఎఫ్ చందాదరులకు గుడ్ న్యూస్.. ఇంట్లో నుంచే క్లయిమ్ సెటిల్‌మెంట్.. చాలా సింపుల్..  
Epfo

Edited By: Janardhan Veluru

Updated on: Jun 04, 2024 | 7:30 AM

ప్రతి ఉద్యోగికి ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) తప్పనిసరి. ప్రతి నెలా ఉద్యోగి జీతం నుంచి కొంత, తన యజమాని నుంచి కొంత మొత్తంం ఆ ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో జమవుతాయి. ఇది వాస్తవానికి పదవీవిరమణ సమయంలో వ్యక్తులకు భద్రతనిచ్చేందుకు ఉద్దేశించిన పథకం. ఇది పెన్షన్ తో పాటు బీమాను కూడా అందిస్తుంది. దీనిని కేంద్ర ప్రభుత్వమే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ద్వారా నిర్వహిస్తుంది. దీనిలో దాదాపు 7.5కోట్ల మంది సభ్యులుగా ప్రస్తుతం ఉన్నారు. సభ్యుల పరంగా చూస్తే ఇదే మన దేశంలో అతి పెద్ద సామాజిక భద్రతా సంస్థ. అయితే దీనిలో జమయ్యే మొత్తం నుంచి కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో కొంతమొత్తాన్ని విత్ డ్రా చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇస్తుంది. గతంలో ఈ ప్రక్రియ చాలా కఠినంగా ఉండేది. ఆఫ్ లైన్ మోడ్లో చేయాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు క్లయిమ్ లను చాలా సులభంగా ఈపీఎఫ్ఓ మంజూరు చేయడంతో పాటు, దరఖాస్తు ప్రక్రియ మొత్తాన్ని ఆన్ లైన్ లో చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. అంతేకాక ఒకవేళ ఖాతాలో ఏమైనా తప్పలున్నా సులభంగా సరిదిద్దుకునే అవకాశాన్ని ఆన్ లైన్లోనే ఇస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

కొత్త ఆర్థిక సంవత్సరంలో కొత్త రికార్డు..

క్లయిమ్ ల ప్రక్రియ ఆన్ లైన్ చేయడం, సులభంగా క్లయిమ్ సెటిల్ మెంట్లు చేస్తుండటంతో చందాదారులు పెద్ద ఎత్తున క్లయిమ్లు చేస్తున్నారు. ఈ కొత్త ఆర్థిక సంవత్సరం మొదలయ్యాక అంటే కేవలం రెండు నెలల్లోనే దాదాపు 87 లక్షల క్లయిమ్‌లు సామాజిక భద్రతా ప్రయోజనాల రూపంలో చందాదారులు చేశారు. వీటిల్లో గృహనిర్మాణం, పిల్లల పోస్ట్ మెట్రిక్ విద్య, వివాహం, అనారోగ్యం, ఫైనల్ ప్రావిడెంట్ ఫండ్ సెటిల్‌మెంట్, పెన్షన్, బీమా మొదలైన వాటి రూపంలో క్లయిమ్ లు పరిష్కారమయ్యాయి. ఇవన్నీ ఆన్ లైన్లోనే క్లయిమ్ అవ్వడం విశేషం. సభ్యుల యూనివర్సల్ అకౌంట్ నంబర్(యూఏఎన్) సాయంతో కంప్యూటర్ సాఫ్ట్ వేర్ అప్లికేషన్ ద్వారానే ఇది సాధ్యమైంది.

ప్రోఫైల్ అప్‌డేట్ కూడా చేసుకోవచ్చు..

2023, ఆగస్టు 22న ఈపీఎఫ్ఓ ​​జారీ చేసిన ప్రామాణిక ఆపరేటింగ్ విధానం (ఎస్ఓపీ) ద్వారా సభ్యుల ప్రొఫైల్‌లలోని డేటా భద్రత నిర్ధారితమవుతోంది. ఇది ఇప్పుడు ఈపీఎఫ్ఓ ​​ద్వారా డిజిటల్ ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వహిస్తున్నారు. పీఎఫ్ సభ్యులు ఇప్పుడు ఆన్‌లైన్ అప్లికేషన్ ఇవ్వడం ద్వారా పేరు, జెండర్, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేరు, వైవాహిక స్థితి, జాతీయత, ఆధార్ మొదలైన డేటాను అప్ డేట్ చేయొచ్చు. అయితే అప్లికేషన్‌తో పాటు మీరు మీ అభ్యర్థనకు సంబంధించిన అవసరమైన పత్రాలను కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

ఇప్పటి వరకు 2.75 లక్షల దరఖాస్తులు..

అప్ డేట్ లకు సంబంధించి అభ్యర్థనలన్నీ సంబంధిత యజమానుల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న పీఎఫ్ కార్యాలయాలకు వెళ్తాయి. ఈ కొత్త సదుపాయాన్ని ఉపయోగించి సభ్యులు తమ అభ్యర్థనలను సమర్పించడం కూడా ప్రారంభించారు. ఈపీఎఫ్ఓ ప్రకారం ఇప్పటి వరకూ ఈ తరహా దరఖాస్తులు 2.75లక్షలు వచ్చాయి. వీటిలో దాదాపు 40,000 దరఖాస్తులు ఇప్పటికే ఈపీఎఫ్ఓ ​​ప్రాంతీయ కార్యాలయాలు పరిష్కరించాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..