Petrol Price Today: గత 12 రోజులుగా దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఈ పెరుగుదులకు ఆదివారం కాస్త బ్రేక్ పడడంతో అంతా కాస్త ఊపిరిపీల్చుకున్నారు. పెట్రోల్ ధరల పెరుగుదల ఇక ఆగిపోనుందా.. అని అందరూ సంతోష పడ్డారు. కానీ ఆ ఆనందం ఒక్క రోజు కూడా ఉండలేదు. సోమవారం మళ్లీ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. అయితే ఈ పెరుగుదల ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కనిపించలేదు. ఇంకా చెప్పాలంటే ఏపీలో ఇంధన ధరల్లో తగ్గుదల కనిపించడం విశేషం. దేశ వ్యాప్తంగా సోమవారం పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.90.58 ఉండగా (ఆదివారం రూ.90.19 ), డీజీల్ రూ80.97 వద్ద కొనసాగుతోంది. ఆదివారం లీటర్ డీజిల్ రూ.80.60 గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర అత్యధికంగా రూ.97.00గా నమోదుకాగా (ఆదివారం రూ.96.62) డీజిల్ రూ. 88.06 గా ఉంది.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఇక్కడ కూడా ధరల పెరుగుదల స్పష్టంగా కనిపించింది. సోమవారం తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో పెట్రోల్ గరిష్ట ధరకు చేరుకుంది. భాగ్యనగరంలో నేడు లీటర్ పెట్రోల్ ధర రూ.94.18గా ఉండగా (ఆదివారం రూ.93.78), డీజిల్ రూ.88.31గా (ఆదివారం రూ.87.91) పలికింది. ఇక తెలంగాణలో మరో ముఖ్య పట్టణమైన వరంగల్‌లో మాత్రం స్వల్పంగా పెట్రోల్ తగ్గగా, డీజిల్ ధర పెరిగింది. ఇక్కడ సోమవారం లీటర్ పెట్రోల్ రూ.93.76 గా (ఆదివారం రూ.93.97) ఉండగా, డీజిల్ రూ.87.91 వద్ద (ఆదివారం రూ. 88.10) కొనసాగుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. విజయవాడలో ఇంధన ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇక్కడ లీటర్ పెట్రోల్ రూ.76.48ఉండగా (ఆదివారం రూ.96.70), డీజిల్ రూ.90.10 వద్ద (ఆదివారం రూ.90.30) కొనసాగుతోంది. సాగర నగరం విశాఖలో పెట్రోల్ రూపాయి మేర తగ్గడం విశేషం సోమవారం లీటర్ పెట్రోల్ రూ.96.16 గా (ఆదివారం రూ.95.36) నమోదు కాగా, డీజిల్ రూ.89.74 వద్ద (ఆదివారం రూ.88.97) కొనసాగుతోంది.