
Petrol, Diesel Prices Hiked: వాహనాదారులకు షాకింగ్ న్యూస్. గత కొన్ని రోజులుగాపశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (Crude Oil) ధరలు పెరగడం వల్ల దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 3 రూపాయలు, డీజిల్‌పై 3 రూపాయలు పెరిగింది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వచ్చాయి.
ముడి చమురు ధరల పెరుగుదల,రూపాయి విలువ క్షీణించడం వల్ల చమురు సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. దీనివల్ల రవాణా ఖర్చులు పెరిగి, సామాన్యులపై భారంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజా ధరలు పెంపు తర్వాత ఢిల్లీలో సాధారణ పెట్రోల్ ధర లీటరుకు సుమారుగా రూ.97.77కు చేరగా, డీజిల్ ధర లీటరుకు రూ.90.67కు చేరింది. మరోవైపు, ప్రీమియం పెట్రోల్ ధర ఇప్పుడు లీటరుకు రూ.104.88గా ఉంది. ఇది ప్రైవేట్ వాహన డ్రైవర్లతో పాటు టాక్సీ, రవాణా రంగాలపై ప్రభావం చూపుతుంది.
అలాగే హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.110.50, డీజిల్ రూ.98.70కి చేరగా, కోల్‌కతాలో ఇది లీటరు పెట్రోల్ రూ.108.74కు, డీజిల్ రూ.95.02, ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.106.68, డీజిల్ రూ.93.03కి చేరింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.67, డీజిల్ రూ.95.39కి చేరింది. ఇంకో విషయం ఏంటంటే ప్రాంతాలను బట్టి ధరల్లో కాస్త తేడా ఉండవచ్చు.