Petrol Diesel Price: వాహనదారులకు ఊరటనిస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. మీ నగరంలో ఎంత.. పూర్తి వివరాలు..

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో పెద్దగా తేడా కనిపించడం లేదు. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ధరలు స్థిరంగా కొనసాగుతుండగా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చిన్నపాటి హెచ్చు.. తగ్గులు కనిపిస్తున్నాయి.

Petrol Diesel Price: వాహనదారులకు ఊరటనిస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. మీ నగరంలో ఎంత.. పూర్తి వివరాలు..
Petrol Diesel Rates Today

Updated on: Dec 24, 2021 | 11:56 AM

Petrol-Diesel Rates Today: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో పెద్దగా తేడా కనిపించడం లేదు. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ధరలు స్థిరంగా కొనసాగుతుండగా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చిన్నపాటి హెచ్చు.. తగ్గులు కనిపిస్తున్నాయి. శుక్రవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ధరల్లో ప్రభావం కనిపించింది. ఇదిలాఉంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.07గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.94.49గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 108.12గా ఉండగా.. డీజిల్ ధర రూ.94.42గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.38గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.72గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20 ఉండగా.. డీజిల్ ధర రూ.94.62గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.69పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.29కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.36లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.110.84 ఉండగా.. డీజిల్ ధర రూ. 95.34గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.29లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.96.84గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.94గా ఉండగా.. డీజిల్ ధర రూ.96.97గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ.110.29లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.96.36లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ.95.41 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 86.67 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.67 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 89.79 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 101.50 ఉండగా.. డీజిల్ ధర రూ.91.52గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.100.58 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.85.01గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.33 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.86.85గా ఉంది.

ఇవి కూడా చదవండి: ఈ అలవాట్లు మానుకోక పోతే మీకు వృద్దాప్యం ముందే వస్తుంది.. అవేంటో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..

Conjoined Twins: వారు ఇద్దరు కాదు ఒక్కరు.. పంజాబ్ కుర్రాళ్లు ఉద్యోగం సాధించారు.. స్ఫూర్తిగా నిలిచారు..

Loading...
Unable to load recommendations.
Follow Us