Petrol Diesel Price: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరల్లో కనిపించని మార్పు..

వరుసగా 33 వ రోజు వరుసగా మార్పులు లేకుండానే సాగుతోంది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ధరలు పెరగక పోవడంతో సామాన్య జనం కొంత సంబుర పడిపోతున్నారు. అయితే..

Petrol Diesel Price: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరల్లో కనిపించని మార్పు..
Petrol And Diesel

Updated on: Aug 19, 2021 | 9:15 AM

Petrol-Diesel Rates Today: దిగు.. దిగు నాగమ్మ అంటూ గత కొద్ది రోజులుగా పాడుకుంటున్న ప్రజానికానికి పెట్రోల్,  డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇలా వరుసగా 33 వ రోజు వరుసగా మార్పులు లేకుండానే సాగుతోంది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ధరలు పెరగక పోవడంతో సామాన్య జనం కొంత సంబుర పడిపోతున్నారు. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ కొద్దిగా పెట్రోల్ ధరల్లో కొద్దిపాటి మార్పులు కనిపిస్తున్నాయి. దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదు. గురువాంర తెలుగు రాష్ట్రాలలో మాత్రం చిన్నపాటి మార్పు కనిపిస్తున్నాయి. ఇదిలాఉంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి.  

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..  

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.83గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 97.96గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.96గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.97.66గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 105.89గా ఉండగా.. డీజిల్ ధర రూ. 97.57గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.106.51గా ఉండగా.. డీజిల్ ధర రూ.98.17గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.83ఉండగా.. డీజిల్ ధర రూ.97.53గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.38 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.10గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.108.47 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.99.60 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.106.80 ఉండగా.. డీజిల్ ధర రూ. 98.03 గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.05లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.99.18గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.96గా ఉండగా.. డీజిల్ ధర రూ.99.16గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 108.47 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.99.60లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 101.84గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 89.47 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.83కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.04గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.102.08 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 92.57 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 102.49ఉండగా.. డీజిల్ ధర రూ.94.02గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.105.25 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.94.86 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.83 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.88.72గా ఉంది.

ఇవి కూడా చదవండి:  Success Story: మేడపై మల్లె పూల సాగు.. లక్షల్లో సంపాదన.. లాక్‌డౌన్ సమయంలో ఓ మహిళ విజయ గాథ..

Women Should be Careful: మీ పక్కనే మృగాళ్లుంటారు.. మహిళలు బీ కేర్ ఫుల్.. సో.. బీ అలర్ట్ లేడీస్..

Loading...
Unable to load recommendations.
Follow Us