Petrol Diesel Price: దుకుడు తగ్గించిన ఆయిల్ కంపెనీలు.. మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..

భారతదేశంలోని చమురు కంపెనీలు ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను తగ్గించిన తర్వాత కర్నాటక సహా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను తగ్గించాయి. దీని ఫలితంగా సెంచరీ కంటే..

Petrol Diesel Price: దుకుడు తగ్గించిన ఆయిల్ కంపెనీలు.. మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
Petrol Diesel

Updated on: Mar 17, 2022 | 8:54 AM

భారతదేశంలోని చమురు కంపెనీలు ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను తగ్గించిన తర్వాత కర్నాటక సహా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను తగ్గించాయి. దీని ఫలితంగా సెంచరీ కంటే తక్కువ ఇంధన ధరలు తగ్గాయి. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈరోజు (గురువారం, మార్చి 17) ఇంధన ధరలో ఎలాంటి మార్పు లేదు. చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం వివిధ ప్రధాన నగరాల్లో పెట్రోల్-డీజిల్ ధరలను విడుదల చేస్తాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరను బట్టి పెట్రోల్-డీజిల్ ధర నిర్ణయించబడుతుంది. ఇదిలావుంటే.. నవంబర్ 2021 వరకు దేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉంటాయి. మెట్రో నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా ఉండగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని చాలా చోట్ల ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఈ వివరాలను వెబ్ సైట్  అందించిన సమాచారం ప్రకారం మీ కోసం..

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.20గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.38గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.94.78గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 108.29గా ఉండగా.. డీజిల్ ధర రూ.94.69గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.55గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.36గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.99 ఉండగా.. డీజిల్ ధర రూ.94.82గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.69 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.91కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.38లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.109.40 ఉండగా.. డీజిల్ ధర రూ. 95.51గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.50 లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.95.52గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.28గా ఉండగా.. డీజిల్ ధర రూ.96.38గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ.110.91లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.96.96లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ.95.41 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 86.67 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.67 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 89.79 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 101.40 ఉండగా.. డీజిల్ ధర రూ.91.43గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.100.58 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.85.01గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.18 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.86.88గా ఉంది.

ఇవి కూడా చదవండి: Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 7.3గా నమోదు..

Harbhajan Singh: మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ బంపర్ ఆఫర్.. రాజ్యసభకు పంపించే ఛాన్స్?

Loading...
Unable to load recommendations.
Follow Us