Petrol Diesel Price Today: ఢిల్లీలో అక్కడే ఉంది..! హైదరాబాద్‌లో మాత్రం రూ.100 మార్క్ దాటిన పెట్రోల్ ధర..! మీ నగరంలో ఎలా ఉందో..!

|

Jun 15, 2021 | 9:18 AM

Petrol Diesel Price Today: వాహనదారులకు పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం లీటర్ పెట్రోల్ ధర రూ.97కి దగ్గరగా ఉంది... కానీ.. హైదరాబాద్‌లో మాత్రం లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్కు దాటేయడం గమనార్హం.

Petrol Diesel Price Today: ఢిల్లీలో అక్కడే ఉంది..! హైదరాబాద్‌లో మాత్రం రూ.100 మార్క్ దాటిన పెట్రోల్ ధర..! మీ నగరంలో ఎలా ఉందో..!
Follow us on

Petrol-Diesel Rates Today:  వాహనదారులకు పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం లీటర్ పెట్రోల్ ధర రూ.97కి దగ్గరగా ఉంది… కానీ.. హైదరాబాద్‌లో మాత్రం లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్కు దాటేయడం గమనార్హం. ఎక్కడో ఉన్న పెట్రో ధరలు ఇప్పుడు కొండెక్కి కూర్చున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.  అయితే అధికారిక సమాచారం ప్రకారం.. మంగళవారం నాడు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.20 గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 95.14గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.34 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.95.26గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 100.80గా ఉండగా.. డీజిల్ ధర రూ. 95.68గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.77గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.65గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.30ఉండగా.. డీజిల్ ధర రూ.95.24 గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.91పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 94.85గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 102.56కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్  ధర రూ. 96.87 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 101.35 ఉండగా.. డీజిల్ ధర రూ.95.72గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.47లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.96.72 గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.78 గా ఉండగా.. డీజిల్ ధర రూ.97.10గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 102.56 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.96.87 లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 96.41గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 87.28 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.58కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.70 గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.96.34 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 90.12 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 97.69ఉండగా.. డీజిల్ ధర రూ.91.92గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.99.63 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.92.53 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 93.68 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.87.72గా ఉంది.

ఇవి కూడా చదవండి: CJI NV Ramana Yadadri tour: యాదాద్రికి సతీసమేతంగా సీజేఏ ఎన్వీ రమణ..