Petrol Diesel Price Today: ప్రభుత్వ చమురు కంపెనీలు శుక్రవారం పెట్రోల్-డీజిల్ ధరను విడుదల చేశాయి. శుక్రవారం కూడా ఇంధన ధరలో ఎలాంటి మార్పు లేకపోవడం.. అంటే ధర నిలకడగా ఉండడం గమనార్హం. నేటికి తొమ్మిది రోజులు గడిచినా చమురు ధరలో పెరుగుదల లేక పోవడం చెప్పుకోదగ్గ విషయం. అంతకుముందు మార్చి 24 నుంచి ఇంధన ధరలను పెంచారు. ఈరోజు తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ కొత్త ధర ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. ఈ సమయంలో, మార్చి 24 , ఏప్రిల్ 1 న ధరలో ఎటువంటి మార్పు లేదు. కానీ అప్పటి నుంచి చమురు ధర నిరంతరం పెరుగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లో ఈ రోజు పెట్రోల్-డీజిల్ ధరలు ఎలా పెరిగాయో.. తగ్గాయో తెలుసుకుందాం.. ఈ వివరాలను వెబ్ సైట్ అందించిన సమాచారం ప్రకారం పెట్రోర్, డీజిల్ ధరలు మీ కోసం..
ఈరోజు క్రూడ్ ఆయిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..
ఈరోజు క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువ రేంజ్‌లో ట్రేడవుతోంది. ఇవాళ అంతర్జాతీయ మార్కెట్‌లో నైమాక్స్ క్రూడ్ బ్యారెల్‌కు 103.50 డాలర్ల చొప్పున ట్రేడవుతోంది. అదే సమయంలో, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $ 108.19 చొప్పున ట్రేడవుతోంది. నైమాక్స్ క్రూడ్ బ్యారెల్‌కు 0.75 డాలర్లు, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.59 డాలర్లు క్షీణిస్తోంది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.119.49గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.105.49గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.119.22గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.105.36గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 119.58గా ఉండగా.. డీజిల్ ధర రూ.105.55గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.120.62గా ఉండగా.. డీజిల్ ధర రూ.106.55గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 119.90 ఉండగా.. డీజిల్ ధర రూ.105.87గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 119 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.105.02గా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.120.04ఉండగా.. డీజిల్ ధర రూ. 105.68గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.120.40లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.106.02గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 121.55గా ఉండగా.. డీజిల్ ధర రూ.107.14గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ.121.50లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.107.09లకు లభిస్తోంది.
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ.105.41 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 96.67లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.117.57కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.104.77 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.115.12 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 99.83 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ.100.84ఉండగా.. డీజిల్ ధర రూ.100.94గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.111.09 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.94.79గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.30 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.88గా ఉంది.
మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలను SMS ద్వారా తెలుసుకోండి
మీరు ప్రతిరోజూ మీ నగరంలో పెట్రోల్ , డీజిల్ ధరలను SMS ద్వారా కూడా తనిఖీ చేయవచ్చు. ఇండియన్ ఆయిల్ (IOC) వినియోగదారులు RSP<డీలర్ కోడ్>ని 9224992249 నంబర్‌కు, HPCL (HPCL) వినియోగదారులు HPPRICE <డీలర్ కోడ్>ని 9222201122 నంబర్‌కు పంపవచ్చు. BPCL వినియోగదారులు RSP<డీలర్ కోడ్>ని 9223112222 నంబర్‌కు పంపవచ్చు.
ఇవి కూడా చదవండి: Owaisi Convoy: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి చేదు అనుభవం.. కాన్వాయ్‌ని అడ్డుకున్న ఆందోళనకారులు
China: అల్లాడిపోతున్న చైనా.. ఆదుకోవాలంటూ అరుపులు, కేకలతో జనం హాహాకారాలు..!