Petrol, Diesel Rates Today: దేశంలో ఇటీవల కాలంలో భారీగా పెరిగిన చమురు ధరలకు బ్రేక్ పడింది. నిత్యం అడ్డు అదుపు లేకుండా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు, వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓ వైపు పెట్రోల్, డీజిల్ ధరలు.. మరోవైపు వంట గ్యాస్ ధరలు రోజుకో తీరుగా పెరగడంతో అందరూ ఆందోళన చెందారు. కొన్ని రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర ఏకంగా రూ.100 మార్క్ కూడా దాటింది. అయితే.. గత కొన్ని రోజులుగా సామాన్యులకు ధరల పెరుగుదల నుంచి ఉపశమనం లభిస్తోంది. కారణాలు ఏమైనప్పటికీ.. కొన్ని రోజులుగా ఇంధన ధరల్లో పెద్దగా మార్పులు చోటుచేసుకోవడం లేదు. అన్నిచోట్ల ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఒక్క తెలుగు రాష్ట్రాలు మరికొన్ని చోట్లనే ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో..
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.30 గా ఉంది. డీజిల్ ధర రూ.89.85 గా ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర 95.36 ఉండగా.. డీజిల్ ధర రూ.88.92 గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.69 గా ఉండగా, డీజిల్ ధర రూ.89.22 గా ఉంది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో నిన్న పెట్రోల్ ధర రూ.93.99 కి ఉండగా.. డీజిల్ ధర రూ.88.05 కి చేరింది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 93.57 ఉండగా, డీజిల్ ధర రూ.87.65 ఉంది. కరీంనగర్‌లో పెట్రోల్ రూ.93.76 ఉండగా, డీజిల్ ధర రూ.87.82 గా ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు.. ఇలా..
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.40 ఉండగా, డీజిల్ ధర రూ.80.73 గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర రూ.96.83 ఉండగా, డీజిల్ ధర రూ.87.81 గా ఉంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.93.43 ఉండగా, డీజిల్ ధర రూ.85.60 గా ఉంది. తమిళనాడు రాజధాని చెన్నైలో పెట్రోల్ ధర రూ.92.43 ఉండగా, డీజిల్ ధర రూ.85.75 గా ఉంది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.62 ఉండగా, డీజిల్ ధర రూ.83.61 గా ఉంది.
Also Read: