Petrol Diesel Price Today: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. ఒక వైపు నిత్యవసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. తాజాగా ఏప్రిల్ 16 పెట్రోల్ ధరలను చమురు కంపెనీలు విడుదల చేశాయి. ఈ రోజు పెట్రోల్ (Petrol), డీజిల్ ధర (Diesel Rates)ల్లో ఎలాంటి మార్పు లేదు. దీంతో వరుసగా 11వ రోజు పెట్రోలు, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పులు లేవు. చివరిసారిగా ఏప్రిల్ 6న పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారు. అయితే ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న దేశంలోని సామాన్యులకు ఇది ఊరటనిచ్చే వార్త. ఎందుకంటే మార్చి 22 నుంచి చమురు ధరలు పెరగడం ప్రారంభించిన తీరు చూస్తుంటే నెల రోజుల్లోనే పెట్రోలు-డీజిల్ 20 నుంచి 25 శాతం వరకు పెంచాయి చమురు కంపెనీలు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 11 రోజులుగా చమురు ధరలు స్థిరంగా ఉన్నాయి.
బెండ్రెక్స్
16 రోజుల్లో చమురు ధర రూ.10 పెంపు:
మార్చి 22 నుండి, చమురు ధరలు పెరగడం ప్రారంభించాయని, చివరిసారిగా ఏప్రిల్ 6 న చమురు ధరలు పెరిగాయి. ఇక రాజధాని ఢిల్లీలో మార్చి 22 నుంచి ఏప్రిల్ 6 వరకు లీటర్ పెట్రోల్, డీజిల్ ధర రూ.10 పెరిగింది. మార్చి 21న ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.41 ఉండగా, ఏప్రిల్ 6న రూ.105.41కి పెరిగింది. అయితే ఏప్రిల్ 6 నుంచి ఇప్పటి వరకు లీటర్ పెట్రోల్ ధర రూ.105.41 వద్ద స్థిరంగా ఉంది. ఢిల్లీతో పాటు ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.120.51, కోల్‌కతాలో రూ.115.12, చెన్నైలో రూ .110.85గా ఉంది .
పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించే ఆలోచన లేదు లేదు:
ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్న దేశం.. పెట్రోల్, డీజిల్ ధరల నుంచి ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని భావిస్తోంది. కానీ, ప్రస్తుతం ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎలాంటి పన్నును తగ్గించే మూడ్‌లో లేదని కొన్ని మీడియా కథనాలలో స్పష్టమైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఈరోజు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్ ధర 111 డాలర్ల కంటే ఎక్కువగా ట్రేడవుతోంది.
ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి:
☛ ఢిల్లీ: లీటర్ పెట్రోల్ ధర రూ.105.41, డీజిల్ ధర రూ.96.67
☛ హైదరాబాద్: లీటర్ పెట్రోల్ ధర రూ.119.49, డీజిల్ ధర రూ.119
☛ ముంబై: లీటర్ పెట్రోల్ ధర రూ.120.51, డీజిల్ రూ.104.77
☛ చెన్నై: లీటర్ పెట్రోల్ ధర రూ.110.85, డీజిల్ ధర రూ.105.49.
☛ కోల్‌కతా: లీటర్ పెట్రోల్ ధర రూ.115.12, డీజిల్ ధర రూ.99.83
ఇవి కూడా చదవండి: