Petrol, Diesel Price Today: దేశంలో అన్నింటి ధరలు మండిపోతున్నాయి. ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా పరుగులు పెట్టిన పెట్రోల్,డీజిల్ ధరలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. ధరల్లో ఎలాంటి మార్పులు ఉండటం లేదు. ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో లీటరు పెట్రోల్-డీజిల్‌పై రూ. 20-25 వరకు నష్టం వాటిల్లుతోంది . కాగా, ఈరోజు కొత్త ధరను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు విడుదల చేశాయి. నేటికీ ధరలో ఎలాంటి మార్పు లేదు.
ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోలు ధర రూ.111.35 కాగా, డీజిల్ ధర రూ.97.28గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.102.63, డీజిల్ రూ.94.24కు విక్రయిస్తున్నారు. అదే సమయంలో కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.106.03 ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.92.76గా ఉంది. ఏపీలోని విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 111.74గా ఉండగా, డీజిల్ రూ. 99.49వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో పెట్రోల్ రేట్ రూ. 109.64గా ఉండగా, డీజిల్ రూ. 97.8 వద్ద కొనసాగుతోంది. మీరు మీ నగరంలో పెట్రోల్, డీజిల్ తాజా ధరలను చూడాలనుకుంటే, మీరు ఈ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా తనిఖీ చేయవచ్చు.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ప్రస్తుతం బ్యారెల్‌కు 113 డాలర్ల స్థాయిలో ఉంది. తాజా నివేదిక ప్రకారం, జూన్ 23 న, భారతీయ ముడి చమురు బాస్కెట్ ధర బ్యారెల్కు $ 109.10. ఒక బ్యారెల్‌లో 159 లీటర్లు ఉంటాయి. క్రూడ్ ధరల పెరుగుదల ప్రక్రియ డిసెంబర్ 2021 నుండి ప్రారంభమైంది.
SMS ద్వారా పెట్రోల్, డీజిల్ ధరలు
మీరు ప్రతిరోజూ మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ (IOC) కస్టమర్‌లు RSP<డీలర్ కోడ్> అని టైప్ చేసి 9224992249 నంబర్‌కు SMS పంపితే ధరల వివరాలు వస్తాయి. HPCL కస్టమర్‌లు HPPRICE <డీలర్ కోడ్> అని టైప్ చేసి 9222201122 నంబర్‌కు పంపవచ్చు. BPCL వినియోగదారులు RSP<డీలర్ కోడ్> అని టైప్ చేసి 9223112222 నంబర్‌కు ఎస్‌ఎంఎస్ పంపితే ధరల వివరాలు వస్తాయి. అయితే ముడి చమురును 2 వేలకు పైగా వస్తువుల తయారీలో ఉపయోగిస్తారు. ఈ లింక్ క్లిక్ చేయడం ద్వారా మీ ప్రాంతం కోడ్ ను తెలుసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి