Petrol-Diesel Price Today: నిత్యవసర సరుకుల ధరలతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా మండిపోతున్నాయి. లీటర్‌కు వంద రూపాయలకుపైగా నమోదు అవుతోంది. గత కొన్ని రోజులు పరుగులు పెట్టిన పెట్రోల్, డీజిల్ ధరలకు బ్రేకులు పడుతున్నాయి. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. ఇక చమురు మార్కెటింగ్ కంపెనీలు జూలై 16 శనివారం పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. నేటికీ పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దీంతో పెట్రోలు, డీజిల్ ధరల్లో మార్పులు రాకపోవడం నేటికి 55 రోజులు పూర్తయ్యాయి. అంటే 55 రోజుల పాటు చమురు ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ .96.72 గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.35, కోల్‌కతాలో రూ.106.03, చెన్నైలో రూ.102.63గా ఉంది. హైదరాబాద్‌లో రూ.109.66, బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.101.94 ఉంది.
అదే సమయంలో ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.89.62, ముంబైలో రూ.94.28, కోల్‌కతాలో రూ.92.76, చెన్నైలో రూ.94.24గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్ డీజిల్ ధర రూ. 97.82 ఉండగా, బెంగళూరులో లీటర్ డీజిల్ ధర రూ.87.89 వద్ద కొనసాగుతోంది. మీరు మీ నగరంలో పెట్రోల్, డీజిల్ తాజా ధరలను చూడాలనుకుంటే, మీరు ఈ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా తనిఖీ చేయవచ్చు . పెట్రోల్, డీజిల్ ధరలలో చివరి సారి మార్పు మే 22 న జరిగింది. ఆ సమయంలో ప్రభుత్వం చమురుపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. మే 22 నుంచి పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
SMS ద్వారా కూడా ధరలు
మీరు ప్రతిరోజూ మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలను SMS ద్వారా కూడా తనిఖీ చేయవచ్చు. ఇండియన్ ఆయిల్ (IOC) కస్టమర్లు RSP<డీలర్ కోడ్>ని 9224992249 నంబర్‌కు, HPCL కస్టమర్లు HPPRICE <డీలర్ కోడ్>ని 9222201122 నంబర్‌కు పంపవచ్చు. BPCL వినియోగదారులు RSP<డీలర్ కోడ్>ని 9223112222 నంబర్‌కు పంపవచ్చు. ఇలా ఎస్ఎంఎస్ పంపడం ద్వారా ధరలను తెలుసుకోవచ్చు. మీమీ నగరాల్లో ఉన్న కోడ్లను తెలుసుకునేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి
రష్యా నుంచి చమురు దిగుమతులు పెంచనున్న భారత్
రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరిగినప్పటి నుండి, ముడి చమురు ధరలు మండిపోతున్నాయి. అయితే యుద్ధం ముగిసిన మూడు నెలల్లో రష్యా నుంచి భారత్ 5.1 బిలియన్ డాలర్ల విలువైన పెట్రోలియం దిగుమతి చేసుకుంది. అలాగే రాబోయే కొద్ది రోజుల్లో రష్యా నుండి చమురు దిగుమతిని భారత్ తీవ్రతరం చేసే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి