Petrol Diesel Price Today: ప్రస్తుతం వాహనదారులకు పెట్రోల్, డీజిల్ ధరలు ఊరటనిస్తున్నాయి. ధరల కారణంగా వాహనాలను బయటకు తీయాలంటేనే జంకుతున్నారు. దాదాపు రూ.110 నుంచి రూ.120 వరకు ఉన్న పెట్రోల్ ధరలతో జనాలు సతమతమవుతున్నారు. ఒక్కసారిగా పెరుగుతూ వచ్చిన పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel) ధరలు.. గత నెల రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ధరల పెరుగుదలలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. చివరిసారిగా ఏప్రిల్ 6న పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అప్పటి నుంచి స్థిరంగా ఉంది. అప్పటి నుండి దేశీయ వంట గ్యాస్ ధర, CNG గ్యాస్ ధర కూడా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు 113 డాలర్ల స్థాయిలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా చమురు సగటు ధర లీటరుకు $ 1.33 అంటే రూ. 102 స్థాయిలో ఉంది. ప్రస్తుతం భారతదేశంలో సగటు పెట్రోల్ ధర లీటరుకు రూ.113గా ఉంది. ఆయిల్ కంపెనీల వివరాల ప్రకారం.. ఈరోజు ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.41 ఉండగా, డీజిల్ ధర రూ.96.67గా ఉంది. ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.119.49 ఉండగా, డీజిల్ ధర రూ.105.49గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 120.51 ఉండగా, డీజిల్ ధర రూ.104.77గా ఉంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.115.12 ఉండగా, డీజిల్ ధర రూ.99.83 చొప్పున విక్రయిస్తున్నారు. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.110.85 ఉండగా, డీజిల్ రూ.100.94గా ఉంది.
ఇక పెట్రోల్, డీజిల్ ధరలను కూడా SMS ద్వారా తెలుసుకోవచ్చు. మీ మొబైల్ నుంచి 9224992249 నెంబర్‌కు SMS పంపాలి. మీరు హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు తెలుసుకోవాలంటే RSP 134483 అని టైప్ చేసి 9224992249 ఫోన్ నెంబర్‌కు మెసేజ్ (Message) పపితే ధరల వివరాలు వస్తాయి.
గ్యాస్ సిలిండర్ తాజా ధర
గ్యాస్ సిలిండర్ ధర పెంపు తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.999.5కి చేరుకుంది. ముంబైలో కూడా ఈ సిలిండర్ ధర రూ.999.5కి చేరింది. కోల్‌కతాలో రూ.1026 కాగా, చెన్నైలో రూ.1015.50కి చేరుకుంది. నోయిడాలో దీని ధర రూ.997.5 ఉంది. అంతకుముందు మే మొదటి రోజు 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. మెట్రో నగరాల్లో దీని ధర రూ.104 వరకు పెరిగింది. మార్చి 22న కూడా 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెరిగింది.